పండుగ సేల్ కోసం ఎదురు చూస్తున్నారా? అసలు ఏం కొనాలనుకుంటున్నారు? ఎంత ఖర్చు చేయబోతున్నారు? Offersపై నిజంగా నమ్మకం ఉందా? ఈ ఫెస్టివల్ ఆఫర్స్ పై (Festival Offers) పబ్లిక్ పల్స్ ఏంటోచూద్దాం. పండుగలు దగ్గరపడుతున్న కొద్దీ shopping fever కూడా మొదలవుతుంది. కొత్త smartphone కొనాలి…ఇంట్లో TV మార్చాలి… Laptop upgrade చేయాలి… లేదా చాలాకాలంగా ఆలోచిస్తున్న electronic gadgetను ఈసారి కొనేయాలి… కానీ చాలామంది వెంటనే కొనరు. “Festive sale వచ్చే వరకు ఆగుదాం… అప్పుడే మంచి discount వస్తుంది.” అనే ఆలోచనతో ఎదురుచూస్తారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. పండుగ sale అంటే అందరికీ కేవలం shopping opportunity కాదు. ఒక మంచి deal దొరుకుతుందనే ఆశ కూడా. అదే సమయంలో, గతంలో వచ్చిన festive offers చూసి కొంతమందికి ఒక సందేహం కూడా ఉంది: “నిజంగానే discount వస్తుందా? లేక sale పేరుతో ధర మార్చి మళ్లీ discount చూపిస్తారా?”
ఈ విషయంపై జరిగిన ఓ తాజా సర్వే చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. మీకు పండుగ ఆఫర్లపై మరింత అవగాహన ఏర్పడుతుంది.

ఎలక్ట్రానిక్స్ కే పెద్దపీట

సర్వే ప్రకారం ముందుగా Festival Offers లో ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది… పండుగ సీజన్‌లో technology లేదా electronics కొనాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది. Surveyలో పాల్గొన్న సుమారు 6000 మందిలో 56.25% మంది ఈ festive seasonలో technology లేదా electronics వస్తువులు కొంటామని ఖచ్చితంగా చెప్పారు
మరో 26.89% మంది తాము కూడా కొనాలని అనుకుంటున్నాం, అయితే అది వచ్చే deals, discounts మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. అంటే దాదాపు ప్రతి పది మందిలో ఎనిమిది మందికి technology shoppingపై ఏదో ఒక స్థాయిలో ఆసక్తి ఉంది అని తెలుస్తోంది. మిగిలిన 16.86% మంది మాత్రం ఈ కాలంలో electronics కొనాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని చెప్పారు. అంటే marketలో ఒక పెద్ద group ఇప్పటికే shopping కోసం సిద్ధంగా ఉంది. కానీ వాళ్లు ఎందుకు వేచి చూస్తున్నారు?


ఫెస్టివల్ ఆఫర్స్ లో డిస్కౌంట్లకే సై అంటున్న మెజారిటీ జనం

“ఇంకొంచెం ఆగితే Festival Offers లోఇంకా మంచి discount వస్తుందేమో!” అనా? కాదు అసలు కారణం ఏమిటంటే Festive sale కోసం వేచి చూస్తున్న వారిలో 65 శాతం మంది మంచి discounts, better offers కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. అంటే shopping decisionలో discount దే పెద్ద పాత్ర అని మనకు అర్ధం అవుతోంది. తర్వాత 12 శాతం మంది No-cost EMI options కోసం వేచి చూస్తున్నామని చెబుతున్నారు. 8 % మంది తాము తమకు కావాల్సినవి కొనాలని నిర్ణయించుకున్నామని, కానీ ఆఫర్లు చూసి కొనాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. 9 % మంది తమ పాత deviceను exchange చేసి కొత్తది కొనాలని చూస్తున్నారు. మరో 6% మంది bank లేదా credit-card cashback offersను ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇక్కడ ఒక interesting point కనిపిస్తుంది. Customerకు “discount” మాత్రమే ముఖ్యం కాదు. EMI, exchange, cashback — ఇవన్నీ కలిపి అసలు ధర ఎంత పడుతుందో కూడా ఆలోచిస్తున్నారు.ట


ఫెస్టివల్ ఆఫర్స్ లో జనం స్మార్టుఫోన్లకే జై అంటున్నారు

అయితే ఏ gadget కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చాలా స్పష్టంగా ఉంది. ఇందులో విజయం Smartphone దే Surveyలో 45 శాతం పైగా smartphones కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
అంటే ఈ festive saleలో అత్యంత డిమాండ్ ఉన్న గాడ్జెట్ smartphone. దాని తర్వాత televisions, laptops వంటి categories ఉన్నాయి. Survey responsesలో సుమారు 16% television-related products, 11 వరకూ laptops కొంటామని చెబుతున్నారు.
మిగిలిన వాళ్ళు audio products, speakers, refrigerators, washing machines, air conditioners, smartwatches ఇలా వివిధ రకాల గాడ్జెట్స్ కోసం చేస్తున్నారు. అంటే festive sale అనేది కేవలం mobile shopping season కాదు. ఇంట్లో technology upgrade చేసుకునే సమయంగా కూడా చాలామంది చూస్తున్నారు అని అర్ధం అవుతోంది కదా.


కానీ క్కడ అందరూ ₹50,000 phone కొనడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ మరో interesting విషయం బయటపడింది. ప్రస్తుతం ఉన్న ధరలు, ఇతర కారణాల వల్ల Festive shoppingలో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి అందరూ సిద్ధంగా లేరు.
Surveyలో 36 % మంది తమ ప్రధాన purchase budget ₹15,000 కంటే తక్కువగా ఉంటుందని చెప్పారు. అంటే ఎంత ఆఫర్లు ప్రకటించినా ప్రతి ముగ్గురిలో ఒకరి budget ₹15,000 లోపే. మరో 22 శాతం దాకా వినియోగదారులు ₹15,000 నుంచి ₹30,000 మధ్య ఖర్చు చేయాలని భావిస్తున్నారు. 21 శాతం ₹30,000 నుంచి ₹50,000 మధ్య ఖర్చు చేసే అవకాశం ఉందని చెప్పారు.
మరో 22 % మంది ₹50,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేయవచ్చని చెప్పారు. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమవుతుంది. Customer ఎంత budget పెట్టుకున్నాడన్నది మాత్రమే కాదు… ఆ budgetలో డిస్కౌంట్ రూపంలో ఎంత value ఆదా అవుతుందన్నదే ముఖ్యమైనది. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే డిస్కౌంట్ వస్తోంది కదా అని ఎదో ఒక ఫోను లేదా గాడ్జెట్ కొనేయాలని అనుకోవడం లేదు. వాటి గురించి ముదుగానే రీసెర్చి చేస్తున్నారు కూడా.


చాలా మంది YouTube లో రివ్యూలు, వాటి స్పెసిఫికేషన్లు, వంటివి బాగా గమనిస్తున్నారు. 30 శాతం మంది technology news websites మరియు articlesను తమ రెండో ముఖ్యమైన sourceగా పేర్కొన్నారు. 15% మంది Instagram మరియు ఇతర social-media platformsను ఉపయోగిస్తున్నారు. 12% మంది friends మరియు family recommendationsను నమ్ముతున్నారు. మరో 7% మంది purchase చేసే ముందు storeలో product demonstration చూసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంటే ఒక customer కొనుగోలు చేసే ముందు ఒకే చోట ఆగిపోవడం లేదు. YouTube → reviews → websites → social media → friends → store అంటూ అనేక చోట్ల information collect చేస్తున్నాడు.


ఫెస్టివల్ ఆఫర్స్ లో మరి ఏ sale కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు?

60 శాతం వినియోగదారులు Flipkart Big Billion Days sale, Amazon Great Indian Festivalను ఎంచుకున్నారు
మరో 24% మంది ఒకే platformకు commit కాకుండా కొనేముందు అన్ని available platformsలో prices compare చేస్తామని చెప్పారు. 11% మంది offline storesలో వచ్చే festive offersను prefer చేశారు. మరో 6% మంది brand యొక్క own websiteలోనే కొనాలని భావిస్తున్నారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం customer behaviourలో మరో మార్పు కనిపిస్తుంది. “ఒక websiteలో sale ఉంది కాబట్టి అక్కడే కొనాలి” అనే రోజులు తగ్గుతున్నాయి. Customer ఇప్పుడు: “అక్కడ ఎంత?” “ఇక్కడ ఎంత?” “Bank offer ఎంత?” “Exchange value ఎంత?” అని compare చేయడం మొదలుపెట్టాడు.


ఫెస్టివల్ ఆఫర్స్ కోసం Payment ఎలా చేయబోతున్నారు?

మరో interesting విషయం — Surveyలో 35% మంది purchase మొత్తాన్ని upfrontగా pay చేయాలని చెప్పారు. 25% మంది No-cost EMIని ఎంచుకోవాలని భావిస్తున్నారు. 2% మంది Cash on Deliveryని prefer చేస్తున్నారు. మరో 18% మంది credit-card EMIను ఉపయోగించవచ్చని చెప్పారు. అంటే festive shoppingలో payment options కూడా customer decisionలో ముఖ్యమైన భాగమే. కానీ payment method ఏదైనా సరే… Surveyలో 35% మంది purchase మొత్తాన్ని upfrontగా pay చేయాలని చెప్పారు. 25% మంది No-cost EMIని ఎంచుకోవాలని భావిస్తున్నారు. 2% మంది Cash on Deliveryని prefer చేస్తున్నారు. మరో 18% మంది credit-card EMIను ఉపయోగించవచ్చని చెప్పారు. అంటే festive shoppingలో payment options కూడా customer decisionలో ముఖ్యమైన భాగమే. కానీ payment method ఏదైనా సరే… Exchange offer పై కూడా పెద్దగా దృష్టిపెడుతున్నారు జనం
ఇప్పుడు చాలామంది కొత్త phone లేదా laptop కొనేటప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నారు: “నా పాత deviceకి ఎంత వస్తుంది?” Surveyలో 50% మంది తమ old deviceను exchange చేయాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మరో 36% మంది ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కేవలం 14% మంది exchange offer ఉపయోగించబోమని చెప్పారు. అంటే దాదాపు సగం మంది festive purchaseలో exchangeను ఒక ముఖ్యమైన భాగంగా చూస్తున్నారు.

అన్నింటికన్నా ముఖ్యవిషయం కాలం మారింది కస్టమర్ ఆలోచనా సరళి కూడా మారుతోంది. Customer discounts కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే ఇవి నిజంగా డిస్కైంట్లా లేదా. దరలు పెంచి తర్వాత డిస్కౌంట్ పేరుతో తగ్గించి అమ్ముతున్నారా అని అనుమానిస్తున్నారు కూడా. ఈ డిస్కౌంట్ సేల్స్ మీద వారికి ఉన్న నమ్మకాన్ని పరశీలిస్తే. గత సంవత్సరం డస్కైంట్ సెల్స్ లో తాము disappointed అయ్యామని 47 శాతం మంది చెప్పడం విశేషం. మరో 26% మంది అప్పుడప్పుడు disappointed అయ్యామని చెప్పారు. 15% మంది మాత్రం గత deals genuineగానే ఉన్నాయని భావించారు.
మరో 12% మంది అసలు pricingను ఎప్పుడూ verify చేయలేదని చెప్పారు. అంటే మొత్తం మీద చాలామంది consumersకి ఒక doubt ఉంది: “Saleలో కనిపిస్తున్న discount నిజంగా డస్కౌంట్లేనా అని?”


ఇలాంటి అనుమాలు మీకూ ఉటాయి కదా ఇక్కడే smart shopping అవసరం ఒక productను saleలో ₹30,000కి చూపించి…
“₹45,000 నుంచి ₹30,000కి!” అని చెప్పడం చూస్తే మనకు ₹15,000 discount వచ్చినట్టు అనిపించవచ్చు. కానీ అసలు question: “ఈ product సాధారణ రోజుల్లో ఎంతకు అమ్ముతున్నారు?” అనేదే. అందుకే festive saleలో shopping చేసే ముందు గత ధరలను కూడా compare చేయడం మంచిది. వాటి ప్రైస్ హిస్టరీ ని గమనించాలి. ఒక్క websiteలో price చూసి నిర్ణయం తీసుకోకుండా… multiple platformsలో compare చేయాలి. Exchange valueను కూడా compare చేయాలి. Bank offer నిజంగా ఎంత benefit ఇస్తుందో చూడాలి. EMI తీసుకుంటే మొత్తం repayment ఎంత అవుతుందో చూడాలి.


ఫెస్టివల్ ఆఫర్స్ పై ఈ survey మనకు ఏం చెబుతోంది?

ఈ మొత్తం కథను ఒక shopping journeyగా చూస్తే చాలా interesting picture కనిపిస్తుంది. ఒక customer పండుగ కోసం ఎదురు చూస్తున్నాడు. అతను మంచి discount కోరుకుంటున్నాడు. అతనిలో చాలామంది smartphone కొనాలని చూస్తున్నారు. చాలామంది ₹15,000 లోపే budget పెట్టుకున్నారు. Product గురించి తెలుసుకోవడానికి YouTubeను చూస్తున్నారు. తర్వాత websitesలో prices compare చేస్తున్నారు. Exchange offerను పరిశీలిస్తున్నారు. No-cost EMI, cashback, bank offersను లెక్కిస్తున్నారు. చివరికి ఏదో ఒక deal కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు అక్కడే మనం ఒక్కసారి ఆగాలి.
* Deal నిజంగా ఎంత మంచిది?
* Seller నిజమైనవాడేనా?
* Website officialదేనా?
* Discount నిజమైనదేనా?
* Exchange offer నిజమేనా?
* Payment page సురక్షితమేనా?
ఇవన్నీ verify చేసిన తర్వాతే Buy Now button నొక్కాలి.


ఎందుకంటే ఈ పండుగ సేల్స్ పై మనం ఎంతగా ఆసక్తి చూపుతున్నామో అంతకన్న ఎక్కువ సైబర్ నేరగాళ్ళు అటెన్షన్ అవుతారు. మన క్యూరియాసిటీని సొమ్ము చేసుకోవడం కోసం రకరకాల మార్గాల ద్వారా మనకు వలవేస్తారు. నమ్మిస్తారు. మన దగ్గర డబ్బులు దోచేస్తారు. అందుకే కోనే ముందు మంచి ఆఫర్ లో నమ్మకమైన ప్లాట్ ఫాం ఎంచుకుని కొనాలి.

DS

Explore the world of technology with us. We cover the latest software reviews, tech stories, future trends, and how-to videos on our YouTube channel. Discover more here.

View all posts

Add comment

Your email address will not be published. Required fields are marked *

  • Welcome to Tech Topics Telugu! 🚀
  • Regularly visit our Channel for latest Tech Trends, Tech Stories, Technology News. On this channel, we bridge the gap between the past and the future of technology, completely in Telugu.
  • What you can expect from Tech Topics Telugu:
  • 🔹 Tech History & Stories: How traditional tech evolved into modern AI.
  • 🔹 Gadget Insights: Clear, unbiased guides on smartphones, smart home devices, and daily tech.
  • 🔹 Software & Web Trends: Demystifying new apps, tools, and internet revolutions.
  • 🔹 Future Tech Trends: A simplified look at what’s coming next in the digital world.
  • Subscribe now and stay tuned for more Tech stories in Telugu! 💡