Smart Phone Buying Guide

200MP కెమెరా ఉందంటే ఫొటోలు అద్భుతంగా వస్తాయా? 10,000mAh బ్యాటరీ ఉంటే అది నిజంగా సూపర్ ఫోనేనా?
120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటే ఆ ఫోన్ లో మంచి ఫీచర్లు ఉన్నట్టేనా?

120W ఫాస్ట్ ఛార్జింగ్, భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, లేటెస్ట్ ప్రాసెసర్, AI ఫీచర్లు… ఇలా ప్రతి కంపెనీ కొత్త కొత్త ప్రత్యేకతలతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇలా స్మార్టుఫోన్ కంపెనీలు చేస్తున్న స్పెసిఫికేషన్స్ ప్రచారం చూసి మనం చాలా టెంప్టయిపోతుంటాం. స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు మనం చేసే పెద్ద తప్పు ఇదే. మన అవసరాలను పక్కనపెట్టి కంపెనీలు ప్రచారం చేసే సంఖ్యలు, ఫీచర్లను చూసి ఆకర్షితులవడం. మొబైల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి వేళ మీ బడ్జెట్ లో మీ అవసరాలకు తగిన విధంగా ఎలాంటి మొబైల్ ఫోను కొనాలి? అని సరైన నిర్ణయ తీసుకోడానికి నేను ఆరు పాయింట్స్ చెబుతాను వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు కావలసిన ఫోను ఎంచుకోవచ్చు. కాబట్టి మీరు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీతో కాస్త మాట్లాడాలి.. అదేనండి నా ఛానెల్ subscribe చేయడం మాత్రం మర్చిపోకండి.

4 జీ RAM, 64 GM internal memory ధర ₹ 17000 నుండి ₹ 21000. మనం ఎక్కడ ఉన్నాం. 4K వీడియో స్ట్రీమింగులు, హై క్వాలిటీ వీడియో షేరింగులు… ఇలాంటి మన వాడకాలకు ఈ స్పెసిఫికేషక్లు తక్కువే. కనీసం 6 జీబీ ఉన్నా చాలు మరి ఆ ఫోను ధర ఎలా పెరిగిందో ప్రాక్టికల్ గా చూద్దాం. నేను ఇక్కడ ఇక ఫోన్ మొడల్ ఉదాహరణగా చూపిస్తున్నాను. ఈ ఫోన్ గత ఏడాది ఇదే గ్రెట్ ఇండిమన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డే సేల్స్ లో 13999, కానీ ఈ ఏడాది హై ప్రైస్ 29,999, డిస్కౌంట్ లో 22999, అంటే 10000 నుండి 15000 వేలు కేవలం మిడిల్ క్లాస్ ఫోన్లపై ధరలు పెరిగాయి. ఈ పరిస్థతితుల్లో అవసరంలేని స్పెసిఫికేషన్లతో డబ్బులు వృధా చేసుకోకుండా. ఫోన్ కొనేముందు ముందుగా మనకు ఏం కావాలో నిర్ణయించుకోవాలి. ఆ తర్వాతే ఏ ఫోన్ కొనాలో ఆలోచించి నిర్ణయం తీసుకోడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది.
ముఖ్యగమనిక: ఈ వీడియో ఈ వేళ ఫోను కొని వెంటనే మళ్ళీ అమ్మేసే వాళ్ళ కోసం కాదు. ఓ మంచి ఫోను కొని దాన్ని దీర్ఘకాలం వాడుకునే వారి కోసం మాత్రమే. మీరు మంచి ఫోన్ కోసం వెతుకుతున్నట్టయితే ఈ Mobile buying guide వీడియో పూర్తిగా చూడండి.

మొబైల్ కొనేప్పుడు ఆరు విషయాలు జాగ్రత్తగా పరిశీలించాలి.

  • డిస్ప్లే
  • కెమేరా
  • బ్యాటరీ
  • ఫాస్ట్ ఛార్జింగ్
  • RAM and Memory
  • ఫోన్ స్పీడ్, లేదా ప్రాసెనర్

పాయింట్ నెంబర్ 1: డిస్ప్లే

మొబైల్ ఫోన్ కొనేటప్పుడు చాలామంది Camera, Processor, RAM, Battery వంటి ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కానీ రోజూ గంటల తరబడి మనం చూసేది డిస్‌ప్లేనే. వీడియోలు చూడటం, సోషల్ మీడియా ఉపయోగించడం, చదవడం, గేమ్స్ ఆడటం, ఫోటోలు ఎడిట్ చేయడం వంటి పనులన్నింటిలో డిస్‌ప్లే నాణ్యత చాలా ముఖ్యం. డిస్ప్లే లో LCD, IPS, OLED, AMOLED, వీటిలో HD+, Full HD+, QHD+ ఇలా రిజల్యూషన్లు ఉంటాయి. ఇవి ఎవరికి ఏ విఉపయోగం అనే విషయాలను కొంచెం టచ్ చేద్దాం

1.1. ఎవరికి ఎలాంటి డిస్‌ప్లే అవసరం?

మీరు కాల్స్, WhatsApp, వంటి సాధారణ అవసరాలకే పరిమితం అయితే మంచి నాణ్యత గల IPS LCD లేదా AMOLED డిస్ప్లే ఎంచుకోండి.
అలా కాకుండా YouTube, సినిమాలు, OTT లు చూస్తుంటే ప్రధానంగా AMOLED డిస్ప్లే ఎంచుకోండి. మంచి కాంట్రాస్ట్, HDR సపోర్ట్ ఉండేలా చూసుకోండి. బయట డేలైట్ లో ఎక్కువగా ఫోన్ వాడేవారు మంచి sustained brightness, తక్కువ reflections ఉండే డిస్ప్లే ఎంచుకోండి.
మీరు ఎక్కువగా గేమ్ లు ఆడుతుంటే ఫోటో, వీడియో ఎడిటింగ్ చేస్తుంటే మాత్రం 120Hz రిఫ్రష్ రేట్ తో, వేగవంతమైన టచ్ రెస్పాన్స్, మంచి motion handling ఉండేలా చూసుకోండి. QHD,QHD+ క్వాలిటీ ఉండేలా చూసుకోండి. వీరికి మంచి colour accuracy అంసరం ఉంటుంది.
ఎక్కువగా రీడింగ్ కు ప్రాధాన్యత ఇచ్చేవారు స్పష్టమైన టెక్స్ట్, సరైన PPI, సౌకర్యవంతమైన brightness ఉంటేలా Full HD, QHD డిస్ప్లే ఉండేలా చూసుకోండి.
పాయింట్ నెంబర్ 2: బ్యాటరీ

200MP కెమెరా ఉందంటే ఫొటోలు అద్భుతంగా వస్తాయా?

స్మార్ట్‌ఫోన్ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే అంశం కెమెరా. ముఖ్యంగా మెగాపిక్సెల్స్ సంఖ్యను పెద్దగా చూపిస్తూ ఫోన్ కెమెరా చాలా గొప్పదని చెబుతుంటారు. కానీ 200MP కెమెరా ఉందంటే ప్రతి ఫొటో అద్భుతంగా వస్తుందని అర్థం కాదు.
ఫొటో నాణ్యతను నిర్ణయించేది మెగాపిక్సెల్స్ మాత్రమే కాదు. కెమెరా సెన్సార్ సైజు, లెన్స్ నాణ్యత, OIS అనే ఇమేజ్ స్టెబిలైజేషన్ సదుపాయం , ఫోన్‌లో ఫొటోల క్వాలిటీ మెరుగుపరిచే సాఫ్ట్‌వేర్, ఇతర హార్డ్ వేర్ వంటివి కెమెరాల నాణ్యతపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు, మనం రాత్రిపూట ఫొటో తీస్తున్నామనుకుందాం. కెమెరాలో మెగాపిక్సెల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, లోలైట్ పెర్మార్మెన్స్ లేకపోతే ఫొటో క్వాలిటీగా రాదు. ఎటువంటి కదలికలు ఉన్నా మంచి ఫొటో రావాలంటే ఇమేజ్ స్టెబిలైజర్ ఉండాలి. అందుకే కెమెరా కొనేటప్పుడు మెగాపిక్సెల్స్ సంఖ్యతో పాటు వాటిలో కెమేరా క్వాలిటీ నిర్ణయించే హార్డవేర్, సాఫ్ట్వేర్ ఫీచర్లు కూడా చాలా ముఖ్యం.
గుర్తుంచుకోండి: కెమెరా ఎంత పెద్ద సంఖ్యతో ఉందన్నది కాదు, అది ఎంత బాగా పనిచేస్తుందన్నదే ముఖ్యం.

పాయింట్ నెం 3. బ్యాటరీ

బ్యాటరీ పెద్దదా ఉంటే బ్యాకప్ నిజంగా ఎక్కువగా వస్తుందా? స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి ఎదురయ్యే సమస్య బ్యాటరీ త్వరగా అయిపోవడం. అందుకే 6,000mAh, 7,000mAh, 10,000mAh బ్యాటరీలతో వచ్చే ఫోన్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
పెద్ద బ్యాటరీ వల్ల సాధారణంగా ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించుకోవచ్చు. రోజంతా బయట తిరిగేవారు, డెలివరీ ఉద్యోగులు, ప్రయాణాల్లో మ్యాచ్ ఎక్కువగా వాడేవారు, అదేపనిగా ఎక్కువగా వీడియోలు చూసేవారికి ఇది ఉపయోగపడుతుంది.
అయితే, లెక్కల్లో బ్యాటరీ పెద్దదిగా కనిపించినంత మాత్రాన అది ఒక్కటే బ్యాకప్‌ను నిర్ణయించదు. ఫోన్‌లోని ప్రాసెసర్ ఎంత పవర్ వినియోగిస్తుంది? డిస్‌ప్లే ఎంత పవర్ తీసుకుంటుంది? మనం ఏ యాప్స్ ఉపయోగిస్తున్నాం? వంటి అంశాలు కూడా బ్యాటరీ మీద ప్రభావం చూపిస్తాయి.
ఇక్కడ మరో విషయం గమనించాలి. భారీ బ్యాటరీ ఉన్న ఫోన్ సాధారణంగా కొంత బరువుగా, పెద్ద పరిమాణంలో ఉండవచ్చు. జేబులో పెట్టుకోవడం, ఒక చేత్తో ఎక్కువసేపు ఉపయోగించడం కొంత అసౌకర్యంగా మారవచ్చు.
అందువల్ల, మీకు రోజంతా బ్యాటరీ అవసరమా? లేక సన్నగా, తేలికగా ఉండే ఫోన్ కావాలా? అనే విషయాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.

పాయింట్ నెంబర్: 4. ఫాస్ట్ ఛార్జింగ్ మేనియా

100W, 120W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటేనే ఫోన్ మంచిదా?

ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇప్పుడు ఫోన్ కొనుగోలులో ముఖ్యమైన ఎట్రాక్షన్ గా మారింది. 100W, 120W వంటి సంఖ్యలు కనిపిస్తే ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని అనిపిస్తుంది.
కానీ ఛార్జింగ్ వాట్స్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన అన్ని సందర్భాల్లోనూ అదే స్థాయిలో వేగం లభిస్తుందని చెప్పలేం. ఫోన్ ఎంత సమయంలో ఛార్జ్ అవుతుంది? ఛార్జింగ్ సమయంలో ఎంత వేడెక్కుతుంది? బ్యాటరీ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఫోన్ లో ఎలాంటి కంట్రోలింగ్ వ్యవస్థ ఉంది? వంటి అంశాలు కూడా ముఖ్యం. బ్యాటరీ వాటేజ్ ని బ్యాలెన్స్ చేసే హార్డువేర్ ఫోన్ లో ఉందా అని కూడా ఒక్కసారి చూడాలి. అదే విధంగా, ఛార్జింగ్ వేగం మాత్రమే కాకుండా బ్యాటరీ దీర్ఘకాలంలో ఎలా పనిచేస్తుందో కూడా ఆలోచించాలి.ఛార్జింగ్ కోసం ప్రతి రోజు కొన్ని నిమిషాలు ఆదా చేయడం చాలా ఉపయోగం. కానీ ఈ పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ మన్నికను దెబ్బతేసే అవకాశాలు ఉన్నాయి. 25W ఫాస్ట్ ఛార్జింగ్ తో పోలిస్తే మిగిలిన హై ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా వచ్చే లాభం కానీ ఆదా కానీ ఏమీ ఉండదు. ఆ ఫాస్ఠ్ ఛార్జింగ్ ఫీచర్ కోసం మొబైల్ పై కొన్ని వేలు ఎక్కువ ఖర్చుచేయాల్సి వస్తుంది అంతే.

పాయింట్ నెం 5: ప్రోసెసర్

ఖరీదైన ప్రాసెసర్ అందరికీ అవసరమా?

ప్రోసెసర్ స్పీడ్ ఇదొక ఎట్రాక్షన్ అడ్వర్టయిజ్మెంట్. ప్రోసెసర్ స్పీడ్ అనేది ఫోన్ లోని ప్రతీ అంశాన్ని ప్రభావితం చేస్తుంది. చివరకు దాని ధరతో పాటు. పొన్ కొనేముందు మనం కాస్త ఆలోచించాలి. ప్రతి ఒక్కరికీ అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఉన్న ఫోన్ అవసరం ఉండదు. మీరు ప్రధానంగా వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఆన్‌లైన్ పేమెట్లు, నార్మల్ ఫొటోగ్రఫీ కోసం ఫోన్ ఉపయోగిస్తుంటే, ఒక మంచి మధ్యస్థాయి ఫోన్‌తోనే ఈ పనులన్నీ సులభంగా చేయవచ్చు.
అలాంటి వినియోగం కోసం అత్యంత ఖరీదైన ప్రాసెసర్ ఉన్న ఫోన్ కొనడం వల్ల మీకు కనిపించే ప్రయోజనం చాలా తక్కువగా ఉండవచ్చు. కానీ ఫోన్ కోసం మీరు పెట్టే పెట్టుబడి అవసరానికి మించి ఉంటుంది. అంటే ఒక 30,000 లకు వచ్చే ఫోను కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అదే మీరు భారీ గేమ్స్ ఆడేవారైతే, అధిక నాణ్యతతో వీడియోలు రికార్డ్ చేసేవారైతే, వీడియో ఎడిటింగ్ వంటి పనులు ఫోన్‌లోనే చేస్తుంటే శక్తివంతమైన ప్రాసెసర్ ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు మీరు హైపవర్ ప్రాసెసర్ల కు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: ఇతరులు ఏ ఫోన్ కొంటున్నారు అనేది ముఖ్యం కాదు. మనం ఏ పనుల కోసం ఫోన్ ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం.

5.1. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ కోసం ఫోన్ కొనేవారు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి

గేమింగ్ కోసం లేదా 4K వీడియోలు ఎక్కువగా చూడడానికి కొనేవారు సాధారణంగా ప్రాసెసర్, RAM, పై దృష్టిపెడతారు. ఇందుకోసం టెక్నికల్ గా బెంచ్‌మార్క్ స్కోర్లు, డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ వంటి అంశాలను చూస్తారు.
ఇవి ముఖ్యమైనవే. అయితే, ప్రాసెసర్ మొదట్లో ఎంత వేగంగా పనిచేస్తుందన్నదాని కంటే, అరగంట లేదా గంట గేమింగ్ చేసిన తర్వాత కూడా అదే పనితీరును కొనసాగించగలదా అనేది మరింత ముఖ్యం.
ఫోన్ ఎక్కువగా వేడెక్కితే ప్రాసెసర్ వేగం తగ్గే ప్రమాదం ఉంది. దాంతో గేమ్‌లో ఫ్రేమ్‌రేట్లు తగ్గడం, గేమింగ్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది.

ఇక్కడ కూలింగ్ వ్యవస్థ పాత్ర కీలకం. కొన్ని ఫోన్లలో వేడిని తగ్గించేందుకు Vapor Chamber వ్యవస్థ లాంటి టెక్నాలజీ ఉపయోగిస్తారు. అయితే, ఆ వ్యవస్థ ఎంత పెద్దదో చూసి మాత్రమే ఫోన్ గేమింగ్ పనితీరును నిర్ణయించకూడదు.
అలాగే, Bypass Charging వంటి సదుపాయాలు కొన్ని ఫోన్లలో ఉంటాయి. ఛార్జర్‌కు కనెక్ట్ చేసి గేమింగ్ చేస్తున్నప్పుడు, కొన్ని ఫోన్లు పవర్ ను బ్యాటరీ ద్వారా కాకుండా నేరుగా ఛార్జర్ నుండి ఫోన్‌కు అందించేందుకు ఈ సాంకేతికత సహాయపడుతుంది. దీనివల్ల బ్యాటరీలో ఉత్పత్తయ్యే వేడిని తగ్గించవచ్చు. ఇలాంటి ఫీచర్లపై కూడా దృష్టిపెట్టాలి. కాబట్టి గేమింగ్ ఫోన్ కొనేవారు ప్రాసెసర్ వేగంతో పాటు ఎక్కువసేపు ఆడినప్పుడు పనితీరు, వేడి నియంత్రణ, బ్యాటరీ నిర్వహణ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ఇవి ఆ బ్రాండ్ మాన్యువల్ లో క్లియర్ గా చెప్పారా లేదా చూడాలి.

పాయింట్ నెంబర్ 6 : మెమొరీ

మొబైల్ ఫోన్ కొనేటప్పుడు చాలామంది 8GB RAM, 12GB RAM, 128GB Storage, 256GB Storage వంటి వివరాలను చూస్తారు. ఎక్కువ RAM ఉంటే ఫోన్ వేగంగా పనిచేస్తుందని, ఎక్కువ Memory ఉంటే ఫోన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రెండింటి పనితీరు వేర్వేరు. సింపుల్‌గా చెప్పాలంటే: RAM అనేది ఫోన్ ప్రస్తుతం చేస్తున్న పనులకు ఉపయోగించే తాత్కాలిక స్థలం. Storage అనేది ఫోటోలు, వీడియోలు, యాప్స్, ఫైల్స్‌ను శాశ్వతంగా దాచుకునే స్థలం.
సాధారణ Android వినియోగదారులకు 8GB RAM + 128GB లేదా 256GB Storage మంచి ప్రారంభ ఎంపిక. ఎక్కువ ఫోటోలు, వీడియోలు నిల్వ చేసేవారికి 256GB లేదా అంతకంటే ఎక్కువ Storage ఉపయోగకరం. భారీ గేమింగ్, కంటెంట్ క్రియేషన్ చేసేవారు 12GB RAMను ఎంచుకోండి. అయితే అవసరానికి మించి స్పెసిఫికేషన్ల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయడం అవసరం లేదు. ఎందుకంటే నేడు ఫోన్ ధరలు ఆకాశానన్నంటడానికి మూల కరణం ఈ మొమెరీనే.

సాఫ్ట్‌వేర్, గురించి కూడా పట్టించుకోండి

ఫోన్ కొనేటప్పుడు చాలామంది కెమెరా, ప్రాసెసర్, RAM, స్టోరేజ్ వంటి అంశాలను మాత్రమే కాకుండా సాఫ్ట్వేర్ మీద కూడా దృష్టి పెట్టాలి. ఫోన్ వేగంగా పనిచేస్తున్నప్పటికీ, కొంతకాలానికి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఆగిపోతే సెక్యూరిటీ సంబంధించిన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఫోన్ కొన్నాక కనీసం 4 సంవత్సరాలు అయినా ఫొన్ కి సాఫ్టువేర్ అప్డేట్స్ అందేలా చూసుకోవాలి.
మీకు అవసరమైన ఫోను బడ్జెట్ అదుపులో ఉంచుకుని కొనుగోలు చేయండి. వచ్చే వీడియోలో పీసీ buying tips గురించి తెలుసుకుందాం.

DS

Explore the world of technology with us. We cover the latest software reviews, tech stories, future trends, and how-to videos on our YouTube channel. Discover more here.

View all posts

Add comment

Your email address will not be published. Required fields are marked *

  • Welcome to Tech Topics Telugu! 🚀
  • Regularly visit our Channel for latest Tech Trends, Tech Stories, Technology News. On this channel, we bridge the gap between the past and the future of technology, completely in Telugu.
  • What you can expect from Tech Topics Telugu:
  • 🔹 Tech History & Stories: How traditional tech evolved into modern AI.
  • 🔹 Gadget Insights: Clear, unbiased guides on smartphones, smart home devices, and daily tech.
  • 🔹 Software & Web Trends: Demystifying new apps, tools, and internet revolutions.
  • 🔹 Future Tech Trends: A simplified look at what’s coming next in the digital world.
  • Subscribe now and stay tuned for more Tech stories in Telugu! 💡