WhatsApp New Rule 2027 : భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) జనవరి 1, 2027 నుండి వాట్సాప్ (WhatsApp) మరియు ఇతర మెసేజింగ్ యాప్‌ల కోసం కఠినమైన సిమ్-బైండింగ్ (SIM-binding) నిబంధనలను తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన గడువు డిసెంబర్ 31, 2026తో ముగుస్తుంది.
ముఖ్యమైన నిబంధనలు మరియు మార్పులు
WhatsApp New Rule 2027 : WhatsApp వంటి యాప్‌లు తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు సంబంధించిన యాక్టివ్, KYC పూర్తయిన సిమ్ కార్డ్ అదే ఫోన్లో ఉందో లేదో వెరిఫై చేయాలి.
• సిమ్ లేకపోతే సేవలు నిలిపివేత: ఒకవేళ రిజిస్టర్డ్ సిమ్ కార్డ్‌ను ఫోన్ నుండి తీసివేసినా, మార్చినా లేదా డీయాక్టివేట్ చేసినా, ఆ ఫోన్లో వాట్సాప్ తాత్కాలికంగా పనిచేయడం ఆగిపోతుంది. మళ్లీ సిమ్ కార్డ్ వేసి అథెంటికేషన్ పూర్తి చేస్తేనే పనిచేస్తుంది.
• ఇతర డివైజ్‌లపై ప్రభావం: యాక్టివ్ సిమ్ కార్డ్ లేని ఇతర విడి ఫోన్లు, టాబ్లెట్లు లేదా వై-ఫై మాత్రమే ఉన్న డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించడంపై పరిమితులు ఉంటాయి.
• వాట్సాప్ వెబ్ / డెస్క్‌టాప్: సైబర్ మోసాలను అరికట్టడానికి కంప్యూటర్ లేదా డెస్క్‌టాప్ లాగిన్ల భద్రతను ప్లాట్‌ఫారమ్‌లు మరింత కఠినతరం చేస్తాయి.
• వాట్సాప్ బిజినెస్ API మార్పులు: జనవరి 15, 2026 నుండి వాట్సాప్ బిజినెస్ API గైడ్‌లైన్స్‌ను అప్డేట్ చేసింది, దీని ప్రకారం సాధారణ ప్రయోజనాల కోసం ఉపయోగించే AI చాట్బాట్లను నిషేధించారు.
సోర్సెస్. ప్రకారం ఈ నిబంధనను టెలీకాం అధారిటీ 2025 చివర్లోనే తీనుకువచ్చిందని తెలుస్తోంది. అంయితో దీనిని ప్రస్తుతం కఠినతరం చేస్తున్నారు. ఎలా అయితే ఫోన్ పే, గూగుల్ పే, ఇంకా ఇతర బ్యాంకింగ్ యాప్ లు సిమ్, కి డివైస్ అంటే ఫోన్ కి బైండింగ్ చేస్తాయో అదే విధంగా ఇంక వాట్సాప్ కూడా పనిచేస్తుంది.
WhatsApp New Rule 2027 ఎలా పనిచేస్తుంది ?
ఇంతవరకూ మీరు మీ ఫోన్ లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుని, మీ ఫ్రెండ్ లేదా ఫ్యామిలీ మెంబర్ల సిమ్ తో లాగిన్ అయితే వాళ్ళ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఉంటే చాలు వేరే ఫోన్ లో లాగిన్ అయిపోవచ్చు. కానీ ఇప్పడు అలా ఉండదు, మీరు ఏ మొబైల్ లో సిమ్ వేశారో అదే డివైస్ నుండి మత్రమే వాట్సాప్ పనిచేస్తుంది. మీ సిమ్ ఉంచిన డివైస్ ని వాట్సాప్ చెక్ చేసుకుంటుంది. ఆ ఈఎంఐఈ నెంబరుతో సిమ్ బైండ్ అయి ఉంటేనే లాగిన్ అవుతుంది. ఒకవేళ మీరు డివైస్ మారిస్తే ‘అంటే మీ సిమ్ తీసి వేరే ఫోన్ లో వేస్తే’ వాట్సాప్ మళ్ళీ లాగిన్ లో సిమ్ బైండింగ్ టెస్ట్ చేసుకుంటుంది. ఆ మెబైల్ లో మీ రిజిస్టర్ సిమ్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నాకే లాగిన్ అవుతుంది.అంటే వాట్సాప్ ఇనస్టాల్ చేసిన మొబైల్ లోనే మీ సిమ్ ఉండాలి, వాట్సాప్ యాప్ ఒక ఫోన్లో సిమ్ వేరే ఫోన్ లో ఉంచి ఓటీపీ ద్వారా లాగిన్ అవడం కుదరదు.
అలాగే మీరు మీ పీసీలో వాట్సాప్ యాప్ కానీ వాట్సాప్ వెబ్ కానీ వాడుతుంటే అది కేవలం ఆరు గంటల వరకూ మాత్రమే లాగిన్ అయి ఉంటుంది. ప్రతీ ఆరు గంలటలకు QR code స్కాన్ చేసి లాగిన్ అవక తప్పదు.
సైబర్ నేరగాళ్ళు రకరకాల పద్దతుల్లో వేరు వేరు నెంబర్లకు లాగిన్ అయి, వాటితో తప ఫొన్లతో తప్పడు మెసేజ్ లు పంపుతూ సైబర్ నేరాలకు పాత్పడుతున్నారు. ఇలా ఇంతవరకూ భారతదేశంలో 22,000 కోట్ల రూపాయల మేర క్రైం జరిగిందని డాట్ వర్గల ద్వారా తెలుస్తోంది.





Add comment