Gen Z వినియోగదారులు సంప్రదాయ టెలివిజన్లకు క్రమంగా దూరమవుతూ, తమ జీవనశైలికి అనుగుణంగా ఉండే మొబైల్, ఫ్లెక్సిబుల్ ఎంటర్టైన్మెంట్ పరికరాల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది యువత షేర్డ్ అకామడేషన్స్‌లో లేదా అద్దె ఇళ్లలో నివసిస్తుండటంతో, ఒక చోటు నుంచి మరో చోటుకు సులభంగా తీసుకెళ్లగలిగే తేలికైన ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ జీవనశైలికి సంప్రదాయ టీవీలు అంతగా సరిపోవడం లేదు. వాటిని తరలించడం కొంత కష్టంతో కూడుకున్న పని. దీంతో పెద్ద స్క్రీన్‌పై వినోదాన్ని ఆస్వాదించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై యువత ఆసక్తి చూపుతోంది.
ఈ అవసరాన్ని తీర్చేందుకు స్మార్ట్ ప్రొజెక్టర్లు వేగంగా ప్రజాదరణ పొందుతున్నాయి. చిన్న సైజులో ఉండటం, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు అంతర్నిర్మితంగా అందుబాటులో ఉండటం, సులభంగా సెటప్ చేసుకునే సౌకర్యం వీటి ప్రత్యేకతలు. ప్రత్యేకమైన ప్రొజెక్షన్ స్క్రీన్ అవసరం లేకుండానే ఇంట్లోని గోడలు వంటి సాధారణ ఉపరితలాలపై చిత్రాలను ప్రొజెక్ట్ చేయవచ్చు. కొన్ని ఆధునిక ప్రొజెక్టర్లు గోడ రంగుకు అనుగుణంగా చిత్రాన్ని ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే ఫీచర్లను కూడా అందిస్తున్నాయి. దీంతో మెరుగైన విజువల్ అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది.
Gen Z ఎంటర్టైన్మెంట్లో మార్పుకు కారణాలు
మారుతున్న ట్రెండ్: ముఖ్యంగా Gen Z యువత సంప్రదాయ టెలివిజన్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఎంటర్టైన్మెంట్ పరికరాలపై ఆసక్తి చూపుతోందని నిపుణులుచెబుతున్నారు.
సంప్రదాయ టీవీ, స్మార్ట్ ప్రొజెక్టర్ మధ్య పోలిక
సంప్రదాయ టెలివిజన్ పెద్ద సైజులో ఉండటం వల్ల ఒక ఇంటి నుంచి మరో ఇంటికి తరలించడం కష్టం. స్మార్ట్ ప్రొజెక్టర్ చిన్న సైజులో ఉండి, సులభంగా ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లవచ్చు.
టిీవీ అయితే ఒకే చోట ఏర్పాటు చేసి అదే స్క్రీన్‌పై చూడాల్సి ఉంటుంది. స్మార్ట్ ప్రొజెక్టర్ ను అవసరాన్ని బట్టి పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. టీవీకోసం హార్డ్‌వేర్, సెటప్, కొన్ని సందర్భాల్లో స్ట్రీమింగ్ పరికరాలు, అదనపు కేబుల్స్ లేదా ప్రత్యేక స్టాండ్లు అవసరమవుతాయి. స్మార్ట్ ప్రొజెక్టర్ కు Google TV, OTT యాప్‌లకు అంతర్నిర్మిత సపోర్ట్ ఉన్న మోడళ్లలో సెటప్ సులభంగా ఉంటుంది. టీవీలు గోడకు మౌంట్ చేయడం లేదా ప్రత్యేక ఫర్నిచర్‌పై ఏర్పాటు చేయడం అవసరం. స్మార్ట్ ప్రొజెక్టర్ కు అనుకూలమైన గోడలు, ఇతర ఉపరితలాలపై ప్రొజెక్ట్ చేయవచ్చు. కొన్ని మోడళ్లలో ఆటోమేటిక్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్ ఫీచర్లు ఉంటాయి.
ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణాలు
స్థిరత్వం కంటే మొబిలిటీకి ప్రాధాన్యత
Gen Z యువతలో చాలామంది మొదట షేర్డ్ అకామడేషన్స్‌లో నివసించి, ఆ తర్వాత అద్దె ఇళ్లకు మారుతుంటారు. తరచుగా ఇళ్లు మారాల్సి రావడంతో, బరువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయడం లేదా తరలించడం వారికి అసౌకర్యంగా మారవచ్చు. అందుకే తేలికగా తీసుకెళ్లగలిగే పరికరాలపై ఆసక్తి పెరుగుతోంది.
పెద్ద స్క్రీన్‌పై వినోదం కావాలి.. కానీ స్థిరమైన టీవీ వద్దు!
Gen Z యువత జీవనశైలికి పెద్ద సైజులో ఉండే టీవీలు అంతగా సరిపోకపోయినా, పెద్ద స్క్రీన్‌పై సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనే ఆసక్తి పెరుగుతోంది. ఈ రెండింటి మధ్య ఉన్న అవసరాన్ని స్మార్ట్ ప్రొజెక్టర్లు తీర్చగలవు. అవసరమైనప్పుడు పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ను ఆస్వాదించి, ఉపయోగం పూర్తయిన తర్వాత ప్రొజెక్టర్‌ను సులభంగా పక్కన పెట్టుకోవచ్చు.
కొత్త తరం టెక్నాలజీ.. మరింత సులభమైన వినియోగం
- ఆధునిక స్మార్ట్ ప్రొజెక్టర్లు ప్రత్యేకమైన ప్రొజెక్షన్ స్క్రీన్ అవసరాన్ని తగ్గిస్తున్నాయి. అనుకూలమైన గోడ లేదా ఇతర ఉపరితలాలపై నేరుగా వీడియోలను ప్రొజెక్ట్ చేయవచ్చు. కొన్ని మోడళ్లలో Google TV, OTT యాప్‌లు, ఆటోమేటిక్ ఫోకస్, కీస్టోన్ కరెక్షన్, వాల్ కలర్ అడ్జస్ట్మెంట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
- సంక్లిష్టమైన సెటప్ లేకుండానే పెద్ద స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ను ఆస్వాదించే అవకాశం లభిస్తోంది.
- మొత్తంగా చూస్తే, యువతకు పెద్ద స్క్రీన్‌పై వినోదం కావాలి, అదే సమయంలో తమ జీవనశైలికి సరిపోయే సౌలభ్యం కూడా కావాలి. ఈ రెండు అవసరాలను సమన్వయం చేసే ప్రత్యామ్నాయంగా స్మార్ట్ ప్రొజెక్టర్లు ముందుకొస్తున్నాయి. అయితే, వీటి పనితీరు, ప్రకాశం (Brightness), గది వెలుతురు, చిత్ర నాణ్యత వంటి అంశాలను బట్టి వీక్షణ అనుభవం మారుతుంది. అందువల్ల ఇవి అన్ని సందర్భాల్లో సంప్రదాయ టీవీలకు పూర్తి ప్రత్యామ్నాయమని చెప్పలేం.





Add comment