Hike in Mobile Prices: ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం వెనుక దాగి ఉన్న మరో కోణం — సామాన్యుడి మొబైల్‌పై భారం పెరుగుతున్నదని, మీచేతిలోని మొబైల్ ధరలు ఆకాశాన్ని తాకడానికి మీరు తెగవాడేస్తున్న AI అప్లికేషన్లు కారణం అంటే నమ్మశక్యంగా లేదు కదూ? ఏమిటి? ఎందుకు? ఎలా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Hike in Mobile Prices : వచ్చే ఏడాది 10000 ఫోన్ 20000 వేలు దాటేస్తుందా?
మధ్యతరగతి వారికి బడ్జెట్ ఫోన్ కల కానుందా?
మనం అతిగా వాడే AI మన ఫోన్ ధరలకే ఎసరు పెడుతోందా?
అసలు AI కి మొబైల్ ధరలకు సంబంధం ఏమిటి?

Hike in Mobile Prices: ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం వెనుక దాగి ఉన్న మరో కోణం — సామాన్యుడి మొబైల్‌పై భారం పెరుగుతున్నదని, మీచేతిలోని మొబైల్ ధరలు ఆకాశాన్ని తాకడానికి మీరు తెగవాడేస్తున్న AI అప్లికేషన్లు కారణం అంటే నమ్మశక్యంగా లేదు కదూ? ఏమిటి? ఎందుకు? ఎలా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

ఒకప్పుడు ₹10,000 చేతిలో ఉంటే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చని చాలామంది భావించేవారు. ఫోన్‌లో మంచి కెమెరా, సరిపడా మెమరీ, ఎక్కువ స్టోరేజ్, పెద్ద బ్యాటరీ వంటి సదుపాయాలు కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు బడ్జెట్ ధరల్లో లభించిన ఫోన్లు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. అదే సమయంలో, మనం చెల్లించే డబ్బుకు తగినన్ని కొత్త ఫీచర్లు లభిస్తాయా? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది.
ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ధరల పెరుగుదలకు కారణం కేవలం ద్రవ్యోల్బణం కాదు. మన జీవితాలను మార్చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా AI కోసం నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్లు, వాటికి అవసరమైన అధిక సామర్థ్యం గల మెమరీ చిప్‌లు, సెమీకండక్టర్ తయారీ సంస్థల ప్రాధాన్యతల్లో వచ్చిన మార్పులు — ఇవన్నీ కలసి స్మార్ట్‌ఫోన్ పరిశ్రమపై ఒత్తిడిని పెంచుతున్నాయని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. అయితే అసలు AI డేటా సెంటర్లకు, మన చేతిలోని స్మార్ట్‌ఫోన్ ధరకు సంబంధం ఏమిటి? అదేగా మీ సందేహం విరాల్లోకి వెళ్ధాం రండి.

  • ధరలు పెరిగితే ఏర్పడే పరిస్థితి ఏంటి
  • AI డేటా సెంటర్లకు మన మొబైల్ చిప్‌లతో సంబంధం ఏమిటి?
  • ఫోన్ తయారీలో మెమరీ ధరే ఎందుకు కీలకం?
  • మెమరీ ధరలు ఎన్ని రెట్లు పెరిగాయి?
  • బడ్జెట్ ఫోన్లకు వచ్చే ముప్పు ఏంటి
  • స్మార్ట్‌ఫోన్ కంపెనీల భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతోంది?

ధరలు పెరిగితే పరిస్థితిని ముందుగా అంచనా వేద్దాం. తర్వాత అసలు విషయంలోకలి వెళదాం.

1. ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ముందే హెచ్చరించింది

2026 జనవరిలో చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ల ప్రతినిధులు, ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) ప్రతినిధులతో జరిగగిన సమావేశంలో, సాధారణంగా సుమారు ₹10,000 ధరలో లభించే 5G స్మార్ట్‌ఫోన్ల ధరలు దీపావళి నాటికి ₹20,000 స్థాయిని దాటవచ్చని తాము హెచ్చరించినట్లు AIMRA ఆ సంస్థ సోషల్ మీడిదదయాలో వెల్లడించింది
రిటైలర్స్ అసోసియేషన్ చెబుతున్న ప్రకారం పాత ధరలకు కొనుగోలు చేసిన ఫోన్ల నిల్వలు తగ్గిపోయిన తర్వాత, మార్కెట్లో ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని ఫోన్ల రిటైల్ ధరలు 20–30 శాతం వరకు ిప్పటికే పెరిగిపోయాయి. ఆపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఫోన్లపై ₹10000 నుండి ₹20000 ధరలు పెంచేశాయి
పరిస్థతి ఒక్కసారి ఆలోచించండి ఒకప్పుడు బడ్జెట్ ఫోన్ కొనడానికి సరిపోయే డబ్బుతో, భవిష్యత్తులో అదే ఏఫోను. కూడా కొనలేసి పరిస్థితి ఏర్పడ నుంది. ఇది కేవలం ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల సమస్య మాత్రమే కాదు. తక్కువ ధరలో మొబైల్ కొనాలనుకునే విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేవారిపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మన దేశంలో ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉండనుండి. ఇప్పడు అసలు సంగతి చర్చిద్దాం
2. AI డేటా సెంటర్లకు మన మొబైల్ చిప్‌లతో సంబంధం ఏమిటి? ఇదే గా మీ ప్రశ్న ఇదే ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం.
AI చాట్‌బాట్‌లు, చిత్రాలు సృష్టించే వ్యవస్థలు, వీడియో జనరేషన్ టూల్స్, క్లౌడ్ ఆధారిత AI సేవలు — వీటన్నింటి వెనుక వేలాది సర్వర్లు పనిచేస్తుంటాయి. ఈ సర్వర్లకు అపారమైన కంప్యూటింగ్ శక్తితో పాటు అధిక వేగంతో డేటాను అందించే మెమరీ కూడా అవసరం. ఈ విషయంలో మీకు పూర్తిగా అర్ధం అవడానికి కాస్త వివరాల్లోకి వెళదాం.
ఇక్కడ రెండు రకాల మెమరీలను మనం అర్థం చేసుకోవాలి.
మొదటిది — మొబైల్ మెమరీ: మన స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌లు పనిచేయడానికి ఉపయోగించే DRAM, ఫొటోలు, వీడియోలు, ఫైళ్లను భద్రపరచడానికి ఉపయోగించే NAND ఫ్లాష్ స్టోరేజ్.
రెండోది — AI మెమరీ: భారీ AI మోడళ్లకు అవసరమైన డేటాను వేగంగా అందించడానికి ఉపయోగించే హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (HBM), అలాగే వీటితో పాటు సర్వర్లలో ఉపయోగించే ఇతర మెమరీలు.
వీటి తయారీకి అవసరమైన సెమీకండక్టర్ ఉత్పత్తి సామర్థ్యం పరిమితంగా ఉన్నప్పుడు, తయారీ సంస్థలు ఏ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. దీంతో AI డేటా సెంటర్లకు అధిక డిమాండ్ ఏర్పడటం వల్ల, మెమరీ చిప్ తయారీ సామర్థ్యంలో ఎక్కువ భాగం ఆ దిశగా మళ్లుతోంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు అవసరమైన మెమరీ సరఫరాపై ప్రస్తుతం ఒత్తిడి పెరుగుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లలో వాడే మెమొరీ చిప్ల ధర ఆకాశాన్నంటడానికి దారి తీస్తోంది. అంటే, AI కోసం పెరుగుతున్న డిమాండ్‌కు, మన ఫోన్‌లోని మెమరీ ధరకు మధ్య పరోక్ష సంబంధం ఏర్పడుతోంది.

3. ఫోన్ తయారీలో మెమరీ ధరే ఎందుకు కీలకం?

ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు కొంచె వివరాల్లోకి వెళ్ళాలి. స్మార్ట్‌Aఫోన్ అంటే కేవలం స్క్రీన్, కెమెరా, బ్యాటరీ మాత్రమే కాదు. దాని లోపల అనేక కీలక భాగాలు ఉంటాయి.
• ప్రాసెసర్
• RAM లేదా మొబైల్ DRAM
• అంతర్గత స్టోరేజ్
• డిస్‌ప్లే
• కెమెరా మాడ్యూల్స్
• సర్క్యూట్ బోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ భాగాలు

వీటన్నింటి తయారీ ఖర్చును కలిపితేనే ఫోన్‌కు సంబంధించిన భాగాల మొత్తం వ్యయం తెలుస్తుంది. దీనినే బిల్ ఆఫ్ మెటీరియల్స్ (BOM) అంటారు.
టెక్నాలజీ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం, బడ్జెట్, మధ్యస్థాయి స్మార్ట్‌ఫోన్లలో మెమరీ, స్టోరేజ్ ఖర్చు మొత్తం బిల్ ఆఫ్ మెటీరియల్స్ BOMలో 60 శాతానికి పైగా చేరుతోంది.
ఒక ఫోన్ తయారీలో ఇంత పెద్ద భాగం మెమరీ, స్టోరేజ్‌పైనే ఖర్చవుతుంటే, వాటి ధరలు పెరిగినప్పుడు తయారీదారులపై ఎంత ఒత్తిడి పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
మెమరీ ధర పెరిగితే తయారీదారులకు మూడు ప్రధాన మార్గాలు కనిపిస్తాయి:
1. ఫోన్ అమ్మకపు ధరను పెంచడం.
2. లాభాల మార్జిన్‌ను తగ్గించుకుని ధరను కొంతవరకు అదుపులో ఉంచడం.
3. తక్కువ ధర ఫోను మోడళ్లను తగ్గించడం లేదా వాటి ఫీచర్లలోమార్పులు చేయడం.
ఈ పరిస్థితులన్నీ వినియోగదారులకు అనుకూలంగా ఖచ్చితంగా అనుకూలంగా ఉండవు.

4. మెమరీ ధరలు నాలుగు రెట్లు పెరిగాయా?

విశ్లేషకులు వెల్లడిస్తున్న గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
టెక్నాలజీ విశ్లేషకుల అంచనాల ప్రకారం, 2025 సెప్టెంబర్‌తో పోలిస్తే మొబైల్ DRAM, NAND ఫ్లాష్ మెమరీ ధరలు సుమారు నాలుగు రెట్లు పెరిగాయి. రాబోయే నెలల్లో అవి ఐదు రెట్ల స్థాయికి చేరవచ్చని అంచనాలు వెస్తున్నారు. మరోవైపు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు గత ఏడాదితో పోలిస్తే కొన్ని మెమరీ భాగాల కోసం ఐదు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ చెల్లిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సంఖ్యలు పరిశ్రమ విశ్లేషకులు పేర్కొన్న మెమరీ ధరల పెరుగుదలకు సంబంధించినవి. అయితే ప్రతి మెమరీ వేరియంట్, ప్రతి ఫోన్ మోడల్ ధర కూడా అదే నిష్పత్తిలో పెరుగుతుందని మాత్రం అర్థం కాదు. అయినప్పటికీ, తయారీ ఖర్చుల్లో ఇంతటి మార్పు చోటుచేసుకుంటే దాని ప్రభావం ఫోన్ ధరలపై పడకుండా ఉండదు. ఎందుకంటే కంపెనీలు అన్నీ సుమారుగా ఒకే బాట అవలంభించే అవకాశాలు ఉంటాయి.
5. ₹15,000 లోపు ఫోన్లకు మరింత ముప్పు!
ఈ పరిస్థితి ముఖ్యంగా తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ విభాగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ అనే సర్వే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ₹15,000 లోపు స్మార్ట్‌ఫోన్ల తయారీ ఖర్చులో మెమరీ, స్టోరేజ్ వాటా గడచిన ఏడాదిలో 20 నుంచి 45 శాతానికి మించి పెరిగింది.
ఇది చాలా పెద్ద మార్పు. ఒకప్పుడు తక్కువ ధరలో ఫోన్ తయారు చేయడానికి ఉపయోగపడిన ఖర్చుల అంచనాలు ఇప్పుడు భారీగా మారుతున్నాయి. మెమరీ ఖర్చు ఇంతగా పెరిగితే, కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి ఇతర భాగాలకు కేటాయించగల బడ్జెట్‌పై కూడా ప్రెషర్ పడుతోందంటున్నారు.
ఈ కారణంటా అందుకే తయారీదారులు తక్కువ ధరలో ఫోన్లను అందించడం కష్టంగా భావిస్తున్నారు.
దీని ఫలితంగా ₹10,000 లోపు ఫోన్ల లభ్యత భారీగా తగ్గిపోతుందని అంచవా వేస్తున్నారు, కొత్త మోడళ్ల ధరలు పెరగడంతో పాటు వచ్చే రోజుల్లో స్మార్టు ఫోన్లలో కెమేరా, డిస్ప్లే, ప్రాసెసర్ వంటి వాటి సామర్ధ్యం తగ్గిపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
మార్పులు రావడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఈ ప్రభావం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఇప్పటికే కనిపిస్తోంది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) గణాంకాల ప్రకారం, 2025లో భారత మార్కెట్‌కు సుమారు 152 మిలియన్ స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయి. 2026 ఫస్ట్ క్వార్టర్లోనే స్మార్ట్‌ఫోన్ సరఫరాలు గత ఏడాదితో పోలిస్తే 4.1 శాతం తగ్గాయి. సంవత్సరాంతానికి ఈ తగ్గుదల 10-15 శాతం నమోదవవచ్చునని భావిస్తున్నారు. నిజంగా ఈ అంచనాలు నిజమైతే, మనదేశంలో వార్షిక మొబైల్ ఫోన్ల సరఫరాలు 2013 తర్వాత కనిస్ట స్థాయికి చేరే అవకాశం ఉందని కథనం చెబుతోంది.
ధరల పెరుగుదల మనదేశంలోని వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలు, తయారీదారుల వ్యూహాలు, మార్కెట్ డిమాండ్ — వీటన్నింటిమీద ప్రభావం చూపనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ధరలు పెరగడానికి దారి తీసే పరిస్థతితులను విశ్లేషకులు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు.

మొత్తం ఫోన్ ధరలో
• 55–60% — మెమరీ ఖర్చుల ప్రభావం
• 20–25% — డాలర్ తో రూపాయి విలువలో మార్పుల ప్రభావం
• మిగిలిన భాగం — లాజిస్టిక్స్, ఇతర భాగాల ధరల పెరుగుదల, అంతే కాకుండా కంపెనీలు తయారీదారుల లాభాల మార్జిన్‌ను కాపాడుకునే ప్రయత్నాలు.
8. స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు కూడా భవిష్యత్తు ప్రణాళిక కష్టమే!
ఈ సంక్షోభం ప్రభావం వినియోగదారులకే పరిమితం కాదు. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా ఓ పెద్ద సవాల్. కొత్త మోడళ్లను రూపొందించడం, వాటి ధరలను నిర్ణయించడం, అవసరమైన భాగాలను ముందుగానే కొనుగోలు చేయడం వంటి విషయాల్లో కంపెనీలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతే మార్కెట్ ల్ మొబైల్ ఫోన్ల ధరల పెరుగుదలకు కూడా కారణం అవుతోంది
మీరు ఒక ఫోన్ కంపెనీని నడుపుతున్నారని ఊహించుకోండి.
ఆరు నెలల తర్వాత విడుదల చేయాలనుకుంటున్న ఫోన్‌కు ఎంత మెమరీ అవసరం? దాని ధర ఎంత ఉంటుంది? అవసరమైన చిప్‌లు సమయానికి లభిస్తాయా? తయారీ ఖర్చులు ఎంత పెరుగుతాయి?
ఇలాంటి ప్రశ్నలకు ముందుగానే ఖచ్చితమైన సమాధానాలు దొరకకపోతే, ఉత్పత్తి ప్రణాళిక మొత్తం దెబ్బతినవచ్చు. అవసరమైన భాగాల లభ్యతను 12 నెలల ముందుగానే అంచనా వేయడం కూడా పరిశ్రమకు కష్టంగా మారింది. అంతేకాదు, MediaTek, Qualcomm వంటి మొబైల్ చిప్‌సెట్ తయారీ సంస్థలు కూడా డేటా సెంటర్ వ్యాపారంపై మరింత దృష్టి పెడుతుండడం మొబైల్ రంగాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది

ముగింపు: AI విప్లవానికి మన జేబు కూడా మూల్యం చెల్లించాలా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. వైద్యం నుంచి విద్య వరకు, పరిశోధన నుంచి వ్యాపారం వరకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. కానీ ఈ విప్లవానికి అవసరమైన కంప్యూటింగ్ శక్తి, డేటా సెంటర్లు, మెమరీ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్ ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ ఖర్చులపైనా ప్రభావం చూపవచ్చు. ఈ కథనంలో పేర్కోన్న మొబైల్ ధరలు ఒక ఉదాహరణ మాత్రమే AI ప్రబావం ఇంకా చాలా రంగాలపై ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ ఇందుకు ఒక ముఖ్యమైన ఉదాహరణ.
భవిష్యత్తులో మనం కొనుగోలు చేసే ఫోన్ మరింత ఖరీదైనదిగా మారుతుందా? అదే ధరలో తక్కువ సదుపాయాలతో లభిస్తుందా? లేక తయారీ సంస్థలు కొత్త సాంకేతిక పరిష్కారాలతో ఈ సమస్యను అధిగమిస్తాయా? దానికి సమాధానం మెమరీ చిప్‌ల సరఫరా, తయారీ సామర్థ్యం, ధరలు, మార్కెట్ పోటీ ఎలా మారుతాయనే దానిపై ఆధారపడి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో వినియోగ దారుని ఆలోచనా సరళి ఏలా ఉంది. తన స్మార్టుఫోను అవసరాలను ఏవిధంగా తీర్చుకోవాలనుకుంటున్నాడు? ఫోన్లను కొనడం మానేస్తారా? లేదా ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అనే అంశంపై నిపుణుల అంచాలతో కూడిన మరో వీడియో తో మళ్ళీ కలుద్దాం. మా చానెల్ SUBSCRIBE చేసుకోవడం మర్చి పోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లతో షేర్ చేసుకోండి జై హింద్. జై భారత్.

DS

Explore the world of technology with us. We cover the latest software reviews, tech stories, future trends, and how-to videos on our YouTube channel. Discover more here.

View all posts

Add comment

Your email address will not be published. Required fields are marked *

  • Welcome to Tech Topics Telugu! 🚀
  • Regularly visit our Channel for latest Tech Trends, Tech Stories, Technology News. On this channel, we bridge the gap between the past and the future of technology, completely in Telugu.
  • What you can expect from Tech Topics Telugu:
  • 🔹 Tech History & Stories: How traditional tech evolved into modern AI.
  • 🔹 Gadget Insights: Clear, unbiased guides on smartphones, smart home devices, and daily tech.
  • 🔹 Software & Web Trends: Demystifying new apps, tools, and internet revolutions.
  • 🔹 Future Tech Trends: A simplified look at what’s coming next in the digital world.
  • Subscribe now and stay tuned for more Tech stories in Telugu! 💡