Multiple Digital Identities : ఆన్లైన్లో మన డిజిటల్ పుట్ ప్రింట్స్ తగ్గించుకోవడం, ఆన్లైన్ లో మోసాల నుండి దూరంగా ఉండాలంటే వేర్వేరు Digital Identities అవరసమా? ఎందుకు అవసరం? వీటిని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి. మన పర్సనల్ లైఫ్, జాబ్, ఆన్లైన్ షాపింగ్, గేమింగ్, YouTube లేదా ఇతర క్రియేటర్ కార్యకలాపాలు…ఇవన్నీ ఒకే అకౌంట్‌తో నిర్వహిస్తే మనకు సౌకర్యంగా అనిపించవచ్చు. కానీ ఆ అకౌంట్లోని ప్రతి వివరాన్ని ఒకదానితో ఒకటి కలిపి మన గురించి ఎక్కువ సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. హ్యాకర్లు, నేరగాళ్ళు, ఒకే క్లిక్ తో మన సమాచారం అంతా రాబట్టేగలరు. అందువల్ల డిజిటల్ గా సెక్యూర్ గా ఉండాలంటే మల్టిపుల్ అక్కౌంట్లు నిర్వహించడం ముఖ్యం.
మన Digital Identityలను వేరు చేయడం చాలా ఉపయోగకరం. ఇలా వేరుగా ఐడెంటిటీలను నిర్వహించే సమయంలో వేటి వేటికి ఎలాంటి ఐడీ ఉండాలి అనేది ప్రశ్న. ఐడెంటిటీలను రెండు రకాలుగా విభజిద్దాం. మొదటిది మన ఫొఫెషనల్ లేదా పర్సనల్ ఐడెంటిటీ, రెండవది పబ్లిక్ ఐడెంటిటీ.
పర్సనల్ ఐడెంటిటీ
ఉద్యోగం, బ్యాంకింగ్ లావాదేవీలు, ఫ్రోపర్టీస్ ఇలాంటి వాటికి మన ఒరిజిల్ ఐడెంటిటీ అవసరం. వీటన్నింటినీ మన ప్రెఫెషనల్ లేదా పర్సనల్ ఐడెంటిటీగా బావిద్దాం. మీ ఒరిజినల్ అడ్రస్, ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీ ఇలాంటివి… కాబట్టి వీటిని మీ సెక్యూర్ ఐడీలు లేదా అక్కౌంట్లుగా పరిగణించాలి. వీటికి వాడిన వివరాలు మరో ఐడీలో ఉపయోగించకుండా పూర్తగా పర్సనల్ గా ఉంచుకోవాలి.
పబ్లిక్ ఐడెంటిటీ
స్నేహితులతో మాట్లాడే ఐడీలు, పబ్లిక్‌గా షేర్ చేసుకునే కంటెంట్ కోసం ఉపయోగించే ఐడీలు, ఆన్లైన్ గేమింగ్ కోసం, షోషల్ మీడియా ప్రజెన్స్ కోసం, తాత్కాలిక అవసరాలకోసం వెబ్ లో మనం బ్రౌజ్ చేస్తున్నప్పుడు..ఒక్కోసారి మన ఐడీ ఇవ్వక తప్పని పరిస్థతి, ఏదైనా యాప్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు లాగిన్ అయ్యేందుకు ఇవ్వవాల్సిన ఐడీలు, ఇవన్నీ మన పబ్లిక్ ఐడీలుగా భావింద్దాం.
ఇటువంటి ఐడీలకు మన ఒరిజినల్ నేమ్ తో సంబంధం ఉండదు. నిక్ నేమ్, పెన్ నేమ్ ఇలాంటివి ఇక్కడ వాడడం లీగల్ కిందకే వస్తుంది. నిజానికి మన డిజిటల్ ఆనవాళ్ళు ఇలాంటి చోటే దొరికిపోతాయి. మరి ఈ ఐడెంటిటీలు ఎలా క్రియెట్ చేసుకోవాలి? ప్రతీ ఐడెంటిటీకి ప్రత్యైక ప్రొఫైల్ మెయింటెన్ చేయండి, ప్రత్యేకమైన ఈమెయిల్ ఐడీ, ప్రత్యేకమైన ఫోన్ నెంబర్ ఉండేలా చూసుకోండి. పాస్వర్డ్ లు, యూజర్ ఐడీ లు కూడా పూర్తిగా భిన్నంగా ఉండేలా జాగ్రత్త పడండి.
ఈ పబ్లిక్ ఐడెంటిల్లో లేదా అక్కౌంట్లలో మీ చిరునామా వంటివి అవసరం లేకుంటే పూర్తిగా ఇవ్వ కూడదు. అసలు ఆ కాలమ్ లో మీ అడ్రస్ అవసరమా లేక కేవలం సిటీ ఎంటర్ చేస్తే సరిపోతుందా అనే విషయం కూడా నిశితంగా గమనించాలి. మీరు పబ్లిక్ ప్రొఫైల్ కోసం డిఫరెంట్ ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నప్పుడు ఫేక్ ఐడెంటిటీ – ఆల్టర్నేట్ ఐడెంటిటీల మధ్య తేడా గమనించాలి. ఎట్టిపరిస్థితుల్లో ఫెక్ ఐడీల్లా కాకుండా ఆల్టర్నేట్ ఐడీగా మాత్రమే మన ఐడెంటిటీ ఉండాలి. మన పర్సనల్, పబ్లిలక్ ఐడీలు లేదా అక్కౌంట్లు రెండింటికీ మధ్య మ్యాచింగ్ ఉండకుండా చూసుకోండి. వేరే పేర్లు, వేరే గుర్తింపులు పెట్టడం మాత్రమే సరిపోదు. ప్రతి అకౌంట్లో ఒకే ఫోటో, ఒకే ఈమెయిల్, ఒకే యూజర్‌నేమ్ లేదా ఒకే బయోగ్రఫీ వాడితే వాటిని కలిపి గుర్తించడం సులభమవుతుంది.
ఇక్కడ నేను చెబుతున్న సేపరేట్ ఐడీలు ఒక ప్రామాణికం ప్రకారం సూచన ప్రాయంగా చెబుతున్నవి. మీరు క్రియేట్ చేసుకునే ఐడీలు మీ అవసరాలకు మీ డైలీ యాక్టివిటీలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునే బాధ్యత మీపైనే ఉంటుంది.
- ముందుగా మీకు ఎన్ని రకాల ఆన్లైన్ కార్యకలాపాలు ఉన్నాయో గుర్తించండి. ప్రతి చర్యకు వేరే అక్కౌంట్ అవసరం ఉందా? అందులో ఏ సమాచారం పబ్లిక్‌గా ఉండాలి? ఎక్కడ ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ చూపించాల్సిన అవసరం లేదు? వంటివి ఐడెంటిఫై చేసుకోండి. అక్కౌంట్లకు Recovery కోసం ఉపయోగించే వివరాలు సురక్షితంగా ఉన్నాయా? అనే అంశం కూడా గుర్తించాలి.
- డిఫరెంట్ అక్కౌట్లకు వేర్వేరు బలమైన Passwordలు ఉపయోగించండి. Password Manager ఉపయోగించడం వల్ల వాటిని గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది. అందుబాటులో ఉన్న చోట Two-Factor Authentication లేదా Passkey వంటి అదనపు ప్రోటెక్షన్ ఆన్ చేయండి.
- ఈ విధంగా మీ డిజిటల్ ఐడెంటిటీలను లేదంటే అకౌంట్లను వేరు చేయడం వల్ల Privacy పెరుగుతుంది; అయితే ఇది మాత్రమే పూర్తి రక్షణ కాదు. ప్రతీ సందర్భంలో మూడు అంశాలు మీ అక్కౌంట్లకు అదనపు సేఫ్టీ కలగచేస్తాయి. ఒకటి. ప్రతీ అక్కౌంట్ లోనూ అవసరమైనంత వరకూ మాత్రమే సమాచారం పంచుకోవడం, రెండు. అకౌంట్ల వివరాలను సేఫ్ గా ఉంచుకోవడం. మూడు. మీ అక్కౌంట్లను ఒకదానితో ఒకటి లింక్ చేయకపోవడం—
ఈ మూడు అలవాట్లు ఆన్లైన్లో మీ డిజిటల్ ఫుట్ ఫ్రింట్‌లను చాలావరకూ తగ్గిస్తాయి. గుర్తుంచుకోండి మీ డిజిటల్ సెక్యూరిటీ కి మీరే బాధ్యులు.





Add comment