గేమింగ్ చరిత్ర : ఈ రోజు మనం వీడియో గేమ్స్ గురించి మాట్లాడుకుంటే వెంటనే గుర్తొచ్చేది అద్భుతమైన గ్రాఫిక్స్, భారీ నగరాలు, నిజమైన మనుషులను తలపించే పాత్రలు, కళ్లు చెదిరే యాక్షన్ సన్నివేశాలు. ముఖ్యంగా Grand Theft Auto సిరీస్ గురించి తెలియని గేమింగ్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు అందరి దృష్టి GTA 6 మీదే ఉంది. కానీ ఒకసారి ఆలోచించండి! ఈ రోజు మనం చూస్తున్న GTA 6 లాంటి అద్భుతమైన గేమ్స్ పుట్టుకకు అసలు పునాది ఎక్కడ పడింది? ఒకప్పుడు కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక చిన్న బంతిని అటూ ఇటూ కదిలించడమే పెద్ద అద్భుతం. అక్కడి నుంచి ఈ రోజు మనం ఒక నగరంలో స్వేచ్ఛగా తిరుగుతూ, కార్లు నడుపుతూ, మనకు నచ్చిన విధంగా జీవితాన్ని అనుభవించే స్థాయికి చేరుకున్నాం. ఈ ప్రయాణంలో వీడియో గేమ్స్ ఎలా మారాయి? Atari(అటారి), Nintendo(నిన్ టెండో), PlayStation(ప్లే స్టెషన్) వంటి సంస్థలు ఎలాంటి విప్లవాన్ని తీసుకొచ్చాయి? GTA ఎలా పుట్టింది? ఈ రోజు GTA 6 వరకు ఎలా చేరుకుంది?
గేమింగ్ చరిత్రలో ఆసక్తికరమైన ప్రయాణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1. వీడియో గేమ్స్ ప్రారంభం – 1950 నుంచి 1970 మధ్య కాలం
- వీడియో గేమ్స్ చరిత్రలోకి వెళితే మనం 1950ల కాలానికి వెళ్లాలి.
- అప్పట్లో కంప్యూటర్లు చాలా పెద్దవిగా ఉండేవి. ఒక గది నిండా ఉండేంత పరిమాణంలో ఉండే ఈ కంప్యూటర్లను ప్రధానంగా శాస్త్రీయ పరిశోధనలు, లెక్కల కోసం ఉపయోగించేవారు.
- 1952లో OXO అనే కంప్యూటర్ గేమ్ రూపొందించబడింది. ఇది మనం ఆడే X, O ఆటకు కంప్యూటర్ రూపం.
- ఆ తర్వాత 1958లో William Higinbotham (విటియం హిగ్గిన్బోథమ్)అనే శాస్త్రవేత్త Tennis for Two అనే గేమ్‌ను రూపొందించారు. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు ఒక చిన్న బంతిని టెన్నిస్ ఆడుతున్నట్లుగా అటూ ఇటూ కొట్టుకోవచ్చు.
- 1962లో Spacewar! అనే గేమ్ వచ్చింది. ఇందులో ఇద్దరు ఆటగాళ్లు అంతరిక్షంలో స్పేస్షిప్లతో పోరాడేవారు.
- ఇవి చిన్న ప్రయోగాలే అయినప్పటికీ వీడియో గేమింగ్ భవిష్యత్తుకు పునాది వేశాయి.
- 1972లో Magnavox Odyssey (మాగ్నావోక్స్ ఒడిస్సీ) పేరుతో ప్రపంచంలో మొట్టమొదటి కమర్షియల్ హోమ్ వీడియో గేమ్ కన్సోల్ మార్కెట్ లోకి విడుదలైంది.
- అదే సంవత్సరం Atari సంస్థ Pong అనే గేమ్‌ను పరిచయం చేసింది.
- స్క్రీన్ మీద రెండు గీతలు, మధ్యలో ఒక బంతి. ఇంతే! కానీ ఈ చిన్న గేమ్ అప్పట్లో జనాల్లో వైరల్ అయిపోయింది.
- ఇక్కడి నుంచే వీడియో గేమ్స్ సామాన్య ప్రజలకు చేరువ కావడం ప్రారంభమైంది.
2. Atari, Nintendo కంపెనీలు గేమింగ్ ను ప్రజల జీవితాల్లోకి ఎలా తీసుకువెళ్ళారు అనేది ఇక్కడ కీలకమైన అంశం
- 1977లో Atari 2600 కన్సోల్ విడుదలైంది. ఇందులో కార్ట్రిడ్జ్లు మార్చుకుంటూ వివిధ గేమ్స్ ఆడుకునే అవకాశం వచ్చింది.
- దీంతో ఒకే పరికరంలో అనేక గేమ్స్ ఆడుకోవడం సాధ్యమైంది.
- 1980లో Pac-Man, ఆ తర్వాత Donkey Kong వంటి గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మనమందరం కూడా వాటిని ఆడుకున్నాం.
- అయితే 1983లో క్వాలిటీ లేని లేని గేమ్స్, అనేక సంస్థలు రావడం వంటి కారణాలతో మార్కెట్లో అధిక పోటీ ఏర్పడింది దీంతో వీడియో గేమింగ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది.
- ఈ పరిస్థితుల్లో జపాన్‌కు చెందిన Nintendo సంస్థ గేమింగ్ పరిశ్రమకు కొత్త ఊపిరి పోసింది. అదే గేమింగ్ ప్రపంచంలో విప్లవం లాంటిది.
- 1985లో Nintendo Entertainment System అనే మొట్టమొదటి గేమింగ్ డివైస్ విడుదలైంది. ఇది ఒక 8-bit home video game console. దీన్ని ఫ్యామిలీ కంప్యూటర్ పేరుతో విడుదల చేశారు. దీనితో పాటు వచ్చిన Super Mario Bros ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
- తర్వాత మరో సంస్థ Sega కూడా Sonic the Hedgehog (హెడ్గాంగ్) అనే గేమ్స్‌తో పోటీకి వచ్చింది.
- ఆతర్వాత 1989లో Nintendo Game Boy విడుదలైంది. దీనితో టీవీ ముందు కూర్చోకుండా ఎక్కడైనా గేమ్స్ ఆడుకునే అవకాశం ఏర్పడింది.
- ఇలా వీడియో గేమ్స్ ఇంటింటికీ చేరడం ప్రారంభించాయి.
3. తర్వాత మన గేమింగ్ చరిత్రలో మూడవ శకం ప్రారంభం అయింది. అదే PlayStation – 3D గేమింగ్ విప్లవం
- 1990లలో కంప్యూటర్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందింది. CD-ROM టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ గేమింగ్ అనుభవం కొత్త పుంతలు తొక్కింది. గేమ్స్‌లో ఎక్కువ ఇన్ఫర్మేషన్, మ్యూజిక్, క్వాలిటీ గ్రాఫిక్స్ వంటివి యాడ్ చేయడం సాధ్యమైంది.
- 1994లో Sony తన మొదటి PlayStation కన్సోల్‌ను విడుదల చేసింది. ఇక్కడి నుండి మనందరి ప్లేస్టేషన్ యుగం ప్రారంభం అయింది. ఇది గేమింగ్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది.
- ఎందుకంటే అప్పటివరకు ఎక్కువగా 2Dలో కనిపించే గేమ్స్, ఇప్పుడు 3D ప్రపంచాలుగా మారడం ప్రారంభించాయి.
- Tomb Raider, Resident Evil, Gran Turismo వంటి గేమ్స్ కొత్త అనుభూతిని అందించాయి.
- 2000లో PlayStation 2 విడుదలైంది. ఇది గేమింగ్‌తో పాటు DVD సినిమాలను కూడా ప్లే చేయగలిగేది.
- ఇదే సమయంలో Microsoft కూడా Xbox కన్సోల్‌తో గేమింగ్ రంగంలోకి ప్రవేశించింది.
- ఇలా గేమింగ్ పరిశ్రమలో పెద్ద సంస్థల మధ్య పోటీ మొదలైంది. ఇంకేముంది పోటీ పెరిగింది. గేమర్స్ పంట పండింది. అనేక రకాల గేమ్స్ మార్కెట్ లోకి రావడం ప్రారంభం అయ్యింది.
4. కానీ అప్పుడే ఈ పరిశ్రమలో మరో కొత్త విప్లవానికి తెరలేచింది.
అదే Grand Theft Auto! 4. GTA పుట్టుక – 1997
- 1997లో స్కాట్లాండ్కు చెందిన DMA Design అనే సంస్థ Grand Theft Auto అనే గేమ్‌ను విడుదల చేసింది.
- అప్పట్లో ఇది ఈ రోజు మనం చూసే GTA లాగా 3Dలో ఉండేది కాదు. నగరాన్ని పైనుంచి చూస్తున్నట్లుగా కనిపించే Top-Down గేమ్ ఇది.
- ఇందులో కార్లు దొంగిలించడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం, మిషన్స్ పూర్తి చేయడం లాంటి పనులు ఆటలో భాగంగా చేయాల్సి వచ్చేది.
- 1999లో GTA 2 విడుదలైంది. ఇందులో గ్రాఫిక్స్, గేమ్‌ప్లే లో క్వాలిటీ వంటివి చాలా మెరుగుపడ్డాయి.
- అయితే 2001లో వచ్చిన GTA III ఈ సిరీస్ భవిష్యత్తునే మార్చేసింది. ఇది GTA గేమ్ రూపాంతరాన్ని మార్చేసింది
- మొదటిసారిగా GTA ప్రపంచాన్ని పూర్తి 3Dలో చూడగలిగాం. నగరంలో మనకు నచ్చిన విధంగా తిరగడం, కార్లు నడపడం, మిషన్లు ఎంచుకోవడం వంటి స్వేచ్ఛను అందించింది.
- దీనినే Open World Gaming అని అంటారు.
- ఈ గేమ్ విజయం తర్వాత GTA ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన గేమింగ్ సిరీస్‌లలో ఒకటిగా మారింది.
5. Vice City, San Andreas – GTAకి అసలైన గుర్తింపు!
- 2002లో GTA Vice City విడుదలైంది.
- 1980ల నాటి Miami(మియామి) వాతావరణాన్ని పోలిన నగరం, నియాన్ లైట్లు, బీచ్‌లు, అద్భుతమైన సంగీతం ఈ గేమ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. Tommy Vercetti (టామీ వెర్సెట్టీ) అనే పాత్ర ద్వారా ఒక ఆసక్తికరమైన క్రైమ్ కథను ఈ గేమ్ లో అందించారు. అప్పటి నుండి గేమింగ్ మరింత ఆసక్తిగా మారింది. ఇది ఆటకాదు ఒక కథ, కథనం అన్నట్టుగా మారిపోయింది.
- ఆ తర్వాత 2004లో GTA San Andreas విడుదలైంది. ఇందులో CJ అనే పాత్ర కథానాయకుడు.
- ఈ గేమ్ ప్రత్యేకత ఏమిటంటే ఒక నగరానికి పరిమితం కాకుండా Los Santos (లాస్ సాంటోస్), San Fierro (సాన్ ఫియారో, Las Venturas(లాస్ వెంట్యురస్) అనే మూడు నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు, పర్వతాలు, ఎడారులను కూడా అన్వేషించుకుంటూ గేమ్ సాగింది.
- ఈ గేమ్ లో పాత్రల శరీర ఆకృతి, ఫిట్నెస్, డ్రైవింగ్ స్కల్స్ వంటివి మార్చుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి.
- ఇలా GTA కేవలం ఒక గేమ్‌గా కాకుండా మనకు నచ్చిన విధంగా ఒక వర్చువల్ ప్రపంచంలో జీవించే అనుభూతిని అందించడం ప్రారంభించింది.
6. GTA IV, GTA V – వాస్తవికతకు దగ్గరైన గేమింగ్!
- 2008లో GTA IV విడుదలైంది.
- Niko Bellic (నికో బెల్లిక్) అనే పాత్రతో రూపొందించిన ఈ గేమ్‌లో హై క్వాలిటీ గ్రాఫిక్స్, కార్ల మూమెంట్స్, మనుషుల ప్రవర్తన, భౌతిక శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలు మరింత రియాలిటీగా కనిపించాయి.
- తర్వాత Rockstar తన RAGE గేమ్ ఇంజిన్‌ను ఉపయోగించి గేమింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది.
- ఆ తర్వాత 2013లో వచ్చిన GTA V – ఈ GTA సిరీస్‌లోనే అత్యంత విజయవంతమైన గేమ్స్‌లలో ఒకటిగా నిలిచింది.
- ఈ గేమ్‌లో Michael(మైకేల్), Franklin(ఫ్రాంక్లిన్), Trevor(ట్రివోర్) అనే ముగ్గురు ప్రధాన పాత్రదారులు ఉంటారు.
- గేమర్స్ ఈ ముగ్గురి మధ్య మారుతూ గేమ్ స్టోరీని కంటిన్యూ చేసేవాళ్ళు.
- ఇక GTA Online ద్వారా ప్రపంచంలోని ఇతర ఆటగాళ్లతో ఇంటర్నెట్లో కలిసి ఆడుకునే అవకాశం వచ్చింది. ఇది నేటి గైమింగ్ విప్లవంలో మరో మైలురాయి.
- ఇళ్లు కొనడం, కార్లు సేకరించడం, వ్యాపారాలు నిర్వహించడం, మిషన్లు పూర్తి చేయడం వంటి ఎన్నో కొత్త అంశాలు, అవకాశాలు వచ్ిచ చేరాయి.
- ఆ తర్వాత GTA V 2013లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానులు కొత్త GTA గేమ్ కోసం దాదాపు 13 సంవత్సరాలు ఎదురుచూశారు.
- ఈ సమయంలో గేమింగ్ టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. కాదే పూర్తిగా మారిపోయింది.
- 4K గ్రాఫిక్స్, Ray Tracing, హై స్పీడ్ SSDలు, కళ్ళు చెదిరే యానిమేషన్లు గేమింగ్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. మరో లోకంలోకి తీసుకెళ్ళాయి.
- ఇప్పుడు ఆ నిరీక్షణకు సమాధానం.. 13 సంవత్సరాల నిరీక్షణ ప్రతిఫలం… బూమ్ ….
- GTA 6! rand Theft Auto! 6
7. GTA 6 – గేమింగ్ ప్రపంచంలో ఇది మరో కొత్త అధ్యాయం! ఈ ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం
- 2023 డిసెంబర్లో Rockstar Games GTA 6 తొలి అధికారిక ట్రైలర్‌ను విడుదల చేసింది.
- ఈ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
- ఈసారి కథ Leonida (లియోండియా) అనే క్రియేటెడ్ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది అమెరికాలోని Florida(ఫ్లోరిడా) ప్రాంతాన్ని పోలి ఉంటుంది.
- మళ్లీ మనం Vice Cityలోకి ప్రవేశించబోతున్నాం. అయితే ఈసారి పూర్తిగా ఆధునిక నగరంగా, మరింత విస్తృతమైన ప్రపంచంగా తీర్చిదిద్దారు.
- ఈ గేమ్‌లో Lucia(లూసియా), Jason(జాసన్) అనే ఇద్దరు ప్రధాన పాత్రలు ఉంటారు.
- వీరి జీవితాలు, నేర ప్రపంచంలో ఎదురయ్యే సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది.
- ఈసారి గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా పాత్రల ముఖ కవళికలు, వాతావరణం, జనసంచారం, నగరంలోని చిన్న చిన్న డిటైల్స్ వరకు మరింత సహజంగా చూపించే ప్రయత్నం చేశారు.
- ఇది PlayStation 5, Xbox Series X|S కోసం ప్కరత్యేకంగా రూపొందించబడింది.
- దాదాపు 13 సంవత్సరాల తర్వాత GTA 6 విడుదల కావడం గేమింగ్ పరిశ్రమలోనే ఒక పెద్ద సంచలన సంఘటనగా నిలుస్తోంది.
- ఇది GTA 5 కు సీక్వెల్ మాత్రమే కాదు. ఆధునిక గేమింగ్ టెక్నాలజీ ఎంతవరకు అభివృద్ధి చెందిందో చూపించే మరో ముఖ్యమైన మైలురాయి.
- ముగింపు – ఈ గేమింగ్ వరల్డ్ 70 ఏళ్ల అద్భుత ప్రయాణం! ఒ సారి మననం చేసుకుందాం.
- ఒక్కసారి ఈ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.
- 1950లలో కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక చిన్న బంతితో ప్రారంభమైన ప్రయాణం…
- 1970లలో Atari ద్వారా ప్రజల్లోకి వచ్చింది.
- 1980లలో Nintendo, Sega ద్వారా ఇంటింటికీ చేరింది.
- 1990లలో PlayStationతో 3D ప్రపంచంలోకి ప్రవేశించింది.
- 2000లలో GTA ద్వారా ఓపెన్ వరల్డ్ గేమింగ్‌కు కొత్త అర్థం వచ్చింది.
- ఇక ఈ రోజు GTA 6తో మరో కొత్త అధ్యాయానికి చేరుకుంది.
- ఒకప్పుడు కేవలం వినోదం కోసం రూపొందించిన వీడియో గేమ్స్, ఈ రోజు టెక్నాలజీ, గ్రాఫిక్స్, మ్యూజిక్, స్టోరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఎన్నో రంగాలు కలిసిన భారీ పరిశ్రమగా ఎదిగాయి.
ఒక చిన్న బంతితో మొదలైన ప్రయాణం… ఈ రోజు ఒక సరికొత్త ప్రపంచాన్ని మన కళ్లముందు సృష్టించే స్థాయికి చేరుకుంది. ఇదే వీడియో గేమ్స్ చరిత్రలోని అసలైన అద్భుతం! ఇదే మన గేమింగ్ వరల్డ్ హిస్టరీ





Add comment