OneUI 9.5 New Features : శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ అభిమానులకు ఒక శుభవార్త. కొత్తగా గెలాక్సీ ఫోను లోకి 10 కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మీ డైలీ లైఫ్ లో చక్కగా ఉపయోగించుకుంటే మీ ఫోనుకే కొత్తలుక్ వస్తుంది.

OneUI 9.5 New Features :

శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ అభిమానులకు ఒక శుభవార్త. కొత్తగా గెలాక్సీ ఫోను లోకి 10 కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిని మీ డైలీ లైఫ్ లో చక్కగా ఉపయోగించుకుంటే మీ ఫోనుకే కొత్తలుక్ వస్తుంది. ప్రస్తుతం గెలాక్సీ ఫోన్లలో One UI 9.0 వెర్షన్ స్టేబుల్ గా ఉంది. త్వరలో అందరి ఫోన్లకి ఈ కొత్త అప్డేట్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం One UI 9.5 బీటా టెస్టింగ్ లోఉంది. త్వరలో అందరికీ స్టేబుల్ గా రాబోతోంది. మీరుకూడా ఈ సాఫ్ట్ వేర్ బీటా వెర్షన్ ను ఇన్ స్టాల్ చేసుకుని కొత్త One UI 9.5 ఫీచర్లని టెస్ట్ చేయాలనుకుంటే మీ మొబైల్ లో మెంబర్స్ యాప్ లోకి వెళ్ళి బీటా ప్రోగ్రాం సెక్షన్ లోకి వెళ్ళి ముందుగా ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. అయితే రెగ్యులర్ గా వాడుకునే ఫోనులో బీటా సాఫ్ట్ వేర్ వేయడం సెక్యూరిటీపరంగా సేఫ్ కాదు. కేవలం మీదగ్గరున్నస్పేర్ ఫోనులో ఇన్ స్టాల్ చేసుకుని టెస్ట్ చేసుకుని కొత్తఫీచర్లను ఎన్ జాయ్ చేయండి.

టాప్ 10 ఫీచర్లు ఇవే

1.Ringtone Download : ఇది బ్రాడ్ న్యూ ఫీచర్. మొబైల్ లో ఉన్న రింగ్ టోన్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 2011 నుంచి 2026 వరకూ డిఫాల్ట్ రింగ్ టోన్లతో పాటుఇంకా మన ఫోనులో ఉన్న ఇతర రింగ్ టోన్లను కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

2. Tap to Share  : గెలాక్సీ ఫోన్ల మధ్య ఫైళ్లను సింగిల్ టాప్ తో షేర్ చేసుకోవడానికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.

3. Lock Apps : గెలాక్సీ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. ఇప్పటిదాకా మన పర్సనల్ యాప్ లను దాచుకోవడానికి సెక్యూర్ ఫోల్డర్ ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు ప్రతీ ఇండివిడ్యువల్ యాప్ ని మన బయోమెట్రిక్స్ తో లాక్ చేసుకోవచ్చు.

4.Mass App Locking: పై ఫీచర్ లో ఇండివిడ్యువల్ గా యాప్ లను లాక్ చేసుకోవచ్చన్నాం కదా. ఇలా ఒక్కో యాప్ ని కాకుండా బల్స్ గా, మాస్ గా యాప్ లను లాక్ చేసుకుని, అన్ లాక్ చేసుకునే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది.

5.Removable Old Files : మొబైల్ లో వేస్ట్ ఫైల్స్ ను ఆటోమెటిక్ గా గుర్తించి డిలీట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడినుంచే అన్ యూజ్డ్ ఫైల్స్ ను సెర్చి చేసుకుని డిలీట్ చేసుకోవచ్చు.

6.Live Wallpaper : ఇది ఐఫోన్ వినియోగదారులకు పాతఫీచరే అయినా గెలాక్సీ వినియోగదారులకు బ్రాండ్ న్యూ ఫీచర్ అని చెప్పాలి. మన ఫొటోలకి త్రీడీ ఎఫెక్టులు ఇచ్చుకుంటూ వాటికి ఆకర్షణీయమైన యానిమేషన్ క్రియేట్ చేసుకుని వాల్ పేపర్ గా పెట్టుకోవచ్చు.

7.Search Bar in Control Panel : కంట్రోల్ పేనల్ (కంట్రోల్ సెంటర్) లో కంట్రోల్స్ ని స్వైప్ చేసుకుని వెతుక్కోకుండా వాటిని సెర్చి చేసుకోవడానికి సెర్చ్ ఆప్షన్ కల్పించారు. కంట్రోల్ పేనల్ కిందే మనకు సెర్చి బార్ కనిపిస్తుంది.

8. Pause Before App Launch : ఇది ఒక కొత్తఫీచర్. ఏదైనా యాప్ ని లాంచ్ చేసేముందు ఓ పది సెకన్ల టైమర్ నడుస్తుంది. పబ్లిక్ ఏరియాల్లో యాక్సిడెంటల్ గా పర్సనల్ యాప్ లు ఓపెన్ అవకుండా ముందుగా టైమర్ రన్ అవడం ప్రారంభమవుతుంది. ఇది మనకు ఒక సెక్యూరిటీ ఎలర్ట్ కింద ఉపయోగపడుతుంది.

9. New Fingerprint Animation : బయోమెట్రిక్స్ లో ఫింగర్ ప్రింట్ అనేబుల్ చేసుకొనేటప్పుడు సరికొత్త యానిమేషన్ ను అందిస్తున్నారు. ఈ యానిమేషన్ యూజర్లకు ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

10. Camera Pro Features : కెమెరాలో చాలా ప్రొ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. కెమెరా ఇంటర్ ఫేస్ లో భారీ మార్పులు జరిగాయి. అన్ని కంట్రోల్స్ ను హోమ్ స్క్రీన్ నుంచే సెట్ చేసుకునే విధంగా ఎంతో ఎట్రాక్టివ్ గా యూజ్ ఫుల్ గా ఈ కొత్త కెమెరా యాప్ ఉండబోతోంది.

ఈ పది ఫీచర్లు ఏమిటి? వాటిని ఎలాగ సెట్ చేసుకోవాలి? పూర్తిగా తెలుసుకునేందుకు ‘Tech Topics Telugu’ యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేసుకోండి. ఛానల్లో ఉన్న వీడియోను పూర్తిగా చూడండి. వీడియో నేరుగాచూడాలంటే ఈ పోస్టు పై నున్న వీడియో ఇమేజ్ పై క్లిక్ చేయండి.

DS

Explore the world of technology with us. We cover the latest software reviews, tech stories, future trends, and how-to videos on our YouTube channel. Discover more here.

View all posts

Add comment

Your email address will not be published. Required fields are marked *

  • Welcome to Tech Topics Telugu! 🚀
  • Regularly visit our Channel for latest Tech Trends, Tech Stories, Technology News. On this channel, we bridge the gap between the past and the future of technology, completely in Telugu.
  • What you can expect from Tech Topics Telugu:
  • 🔹 Tech History & Stories: How traditional tech evolved into modern AI.
  • 🔹 Gadget Insights: Clear, unbiased guides on smartphones, smart home devices, and daily tech.
  • 🔹 Software & Web Trends: Demystifying new apps, tools, and internet revolutions.
  • 🔹 Future Tech Trends: A simplified look at what’s coming next in the digital world.
  • Subscribe now and stay tuned for more Tech stories in Telugu! 💡