Mobile Sales Crash in India : Omdia Survey Report
గడిచిన పదేళ్లలోనే భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అత్యంత దారుణమైన పతనాన్ని చూసింది. ఇండియాలో Mobile Sales Crash అయ్యాయి. ప్రస్తుతం ఫెస్టివ్ సేల్స్ నడుస్తున్నాయి… మొబైల్ సేల్స్ బూమ్ అయిపోతాయనుకున్నాం, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వంటి భారీ ఆఫర్లు ఉన్నప్పటికీ, ఫోన్ అమ్మకాలు పుంజుకోకపోగా దారుణంగా పడిపోయాయి.
ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘Omdia’ చేసిన స్మార్టుఫోన్ మార్కెట్ పల్స్ సర్వే 2026 Q3 భాగంగా విడుదల చేసిన సరికొత్త డేటా ప్రకారం, లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ షిప్మెంట్లు ఏకంగా 26% క్షీణించి కేవలం 35.8 మిలియన్ యూనిట్లకు పడిపోయాయి. 2016 తర్వాత ఒక ఫెస్టివ్ క్వార్టర్లో నమోదైన అతి తక్కువ సంఖ్య ఇది.
అసలు జనాలు కొత్త ఫోన్లు ఎందుకు కొనట్లేదు? వివో అమ్మకాలు 34% ఎందుకు పడిపోయాయి? శామ్సంగ్ మళ్లీ నంబర్ వన్ స్థానాన్ని ఎలా దక్కించుకుంది? ఈ వివరాలన్నీ డేటాతో సహా క్లియర్‌గా విశ్లేషిద్దాం.
పతనం వెనుక ఉన్న 3 ముఖ్య కారణాలు:
సాధారణంగా దసరా, దీపావళి సీజన్లో ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. కానీ ఈసారి ఇంత భారీగా పడిపోవడానికి మూడు ప్రధాన కారణాలున్నాయి:
1. మొమెరీ ధరలు భారీగా పెరిగిపోవడం. మొబైల్ తయారీ కాస్ట్ Bill of Materials (BOM)లో మొమెరీ ఖర్చు 55 నుండి 60 శాతానికి పెరిగిపోవడం.
2. కాస్ట్ కటింగ్ కోసం మొబైల్ స్పెసిఫికేషన్లలో రాజీ: మెమరీ, ప్రాసెసర్ల ఖర్చులు పెరగడంతో బ్రాండ్లు ఆ భారాన్ని కస్టమర్లపై వేశాయి. రూ.15,000 లోపు వచ్చే ఫోన్ల స్పెసిఫికేషన్లు రెండేళ్ల క్రితం నాటి ఫోన్ల కంటే దారుణంగా తగ్గిపోయాయి. అంటే 15000 పెట్టి ఒక మామూలు ఫోన్ కొనడానికి కన్స్యమర్ సిద్దంగా లేదు.
3. ఆన్లైన్ సేల్స్ పై తగ్గిన క్రేజ్: ఒకప్పుడు ఉన్నంత భారీ డిస్కౌంట్లు ఇప్పుడు ఆన్లైన్ సేల్స్‌లో కనిపించడం లేదు. జనాలు కూడా పాత ఫోన్లను మూడేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు వాడుతున్నారు తప్ప త్వరగా మార్చడం లేదు.
ఈ పరిస్థితిలో ఏ బ్రాండ్ ఏ స్థానంలో ఉందో లీడర్‌బోర్డ్ చూద్దాం:

నెం.1: శామ్సంగ్ (Samsung)
2024 తర్వాత మళ్లీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 6.7 మిలియన్ యూనిట్లు అమ్ముడయ్యాయి. వీళ్ల A-సిరీస్ (A07, A17, A27), అలాగే ఫ్లాగ్షిప్ S26 సిరీస్‌లకు నో-కాస్ట్ ఈఎమ్ఐ, బ్యాంక్ ఆఫర్లు బాగా ఉపయోగపడ్డాయి.
నెం.2: వివో (vivo)
టాప్ 5 లో అత్యధిక నష్టాన్ని చవిచూసింది వివోనే. అమ్మకాలు ఏకంగా 34% పడిపోయి 6.4 మిలియన్లకు పరిమితమయ్యాయి. పదే పదే ధరలు పెంచడం, బడ్జెట్ సెగ్మెంట్లో స్టాక్ కొరత రావడం వీరికి దెబ్బకొట్టింది.
నెం.3 & 4: ఒప్పో (OPPO) & షావోమి (Xiaomi)
ఒప్పో 4.9 మిలియన్ల వద్ద నిలిచింది (-24%). రెనో16 సిరీస్ ద్వారా కాస్త నిలదొక్కుకుంది. షావోమి 4.7 మిలియన్లతో నాలుగో స్థానానికి పడిపోయింది (-28%). ధరలు పెరగడంతో స్పెసిఫికేషన్లలో కాంప్రమైజ్ కావడం షావోమికి ప్రతికూలంగా మారింది.
నెం.5: యాపిల్ (Apple)
3.9 మిలియన్ యూనిట్లతో ఐదో స్థానంలో నిలిచింది. పాత ఐఫోన్ల డిమాండ్‌తో పాటు, ఐఫోన్ 18 ప్రో మోడల్స్‌కు ఈఎమ్ఐలు బాగా హెల్ప్ అయ్యాయి.
బడ్జెట్ ఫోన్ల యుగం ముగిసిందా?:
Omdia నివేదికలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే:
భారత మార్కెట్లో చైనీస్ బ్రాండ్ల వాటా గత ఏడాది 75% ఉండగా, ఇప్పుడు 68%కి పడిపోయింది. అంటే మార్కెట్ ఇప్పుడు ప్రీమియమైజేషన్ (Premiumization) వైపు వెళ్తోంది. జనాలు ప్రతి రెండేళ్లకు రూ.10,000 – రూ.12,000 పెట్టి ప్లాస్టిక్ ఫోన్లు కొనడానికి ఇష్టపడట్లేదు. కాస్త బడ్జెట్ పెంచుకుని, ఈఎమ్ఐలు పెట్టుకుని అయినా శామ్సంగ్ లేదా ఐఫోన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజంగా ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉంటే అదనంగా ఖర్చు పెట్టడానికి 40% మంది సిద్ధంగా ఉన్నారని ఈ సర్వే చెబుతోంది.
2027 లో కూడా మార్కెట్ మరింత మందగించే అవకాశం ఉందని Omdia అంచనా వేస్తోంది. కేవలం చిన్న చిన్న మార్పులతో ఫోన్లు తెస్తే ఇక జనాలు పట్టించుకోరు.





Add comment